" ప్రపంచాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది "

నా పేరు రఘురామ్.

నేను 2005 సంవత్సరం నుంచి ధ్యానం చేయడం ప్రారంభించాను. ప్రతిరోజూ పిరమిడ్లో ధ్యానం చేసేవాడిని. అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ తర్వాత MCA కోచింగ్కి వెళ్ళాను, కానీ దానిలో చేరలేదు. ఎందుకంటే అప్పటివరకు నాలో కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువగా వుండేది.

ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టాను. క్రమంగా నాలో చాలా ఆత్మవిశ్వాసం పెరిగింది. తర్వాత 2007 లో " కానిస్టేబుల్ " గా సెలెక్ట్ అయ్యాను.

మనం ఏదైనా పని మొదలు పెట్టే ముందు ఒక్క పదినిమిషాలు ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఆ పని నెరవేరుతుంది. ఈ ధ్యానం అనేది మనకు ఒక రక్షణవలయంగా వుంటుంది. మనం ఎటువంటి స్థితిలో వున్నా మనల్ని అది సదా రక్షిస్తూనే వుంటుంది. పుస్తకాలు చదవటం, సజ్జన సాంగత్యం వలన మనకు జ్ఞానం కలుగుతుంది. మనకు జ్ఞానం అనేది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. 2009 లో నేను " సబ్ ఇన్స్పెక్టర్ " గా సెలెక్ట్ అయ్యాను . ఇప్పుడు నేను పోలీస్ అకాడెమీ, హైదరాబాద్లో S.I. గా ట్రైనింగ్ చేస్తున్నాను.

ఈ ధ్యానం వలన అందరినీ బేషరతుగా ప్రేమించాలనే విషయం నాకు అర్థమైంది. మనం ఇతరులను ప్రేమించకపోతే మనల్ని మనం కూడా ప్రేమించుకోలేము. అందరినీ సమదృష్టితో చూడాలనే విషయం నాకు అర్థమైంది. దీనివలన నాకు ప్రపంచాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే సామర్థ్యం పెరిగింది.

ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలున్నా అవి ఈ ధ్యానం వలన దూరమైపోతాయి. ఈ ధ్యానం వాటిని మన దగ్గరకు చేరనీయదు. ఈ ధ్యానం అనేది మనకు ఏం కావాలో అదే నిర్దేశిస్తుంది. మన మంచి, చెడుల గురించి అదే చూసుకుంటుంది.

ఒక పని చేయాలంటే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే ఒక రెండు నిమిషాలు శ్వాసను గమనిస్తే చాలు మనకు కావలసింది అదే సమకూరుస్తుంది.

ధ్యానం వలన ఖచ్చితంగా చాలా లాభాలు ఉన్నాయని స్వఅనుభవపుర్వకంగా తెలుసుకున్నాను. నాలాగే ప్రతిఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో అలవరచుకుని ధ్యాన ఫలితాన్ని పొందాలనీ, జీవితాలను ఆనందమయం చేసుకోవాలనీ కోరుకుంటున్నాను.

 

- రఘురామ్,
శ్రీకాళహస్తి, చిత్తూరు

Go to top