" మాత్రలు వేసుకోవడం పూర్తిగా ఆపేసాను "

నా పేరు గుండ్లూరు దివాకర్.

మాది తిరుపతి. నేను ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, నరసింహులు.

మొట్టమొదట నేను బ్రహ్మర్షి పత్రీజీని మార్చి 2 వతేదీ 2010 న శ్రీ వేంకటేశ్వర ధ్యానమందిరం ప్రారంభోత్సవంలో కలిశాను. మా నాన్నగారు 2009 సంవత్సరం జూన్ నెల నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ది తిరుపతి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆధ్వర్యంలో హంపి, తుంగభద్ర డ్యామ్, ఆల్మట్టి డ్యామ్ మరి కూడలి సంగమం చూపించడానికి 2009 సెప్టెంబర్లో ధ్యాన టూర్ ఏర్పాటుచేశారు.

ఆ టూర్కి మమ్మల్నందర్నీ మా నాన్నగారు తీసుకెళ్ళారు. ఆ విధంగా మా కుటుంబానికి పిరమిడ్ ధ్యాన పరిచయం జరిగింది. మేమందరం కలిసి హంపి దేవాలయంలో ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం అయిపోయిన తర్వాత అక్కడ అందరి అనుభవాలు విని నేను ధ్యానం బాగా చేయాలని నిశ్చయించుకుని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను.

అంతకుముందు నాలుగు సంవత్సరాల వయస్సు నుంచి నేను ఆస్థమాతో బాధపడుతూ చాలా ఆసుపత్రులు తిరిగి రకరకాల మందులు వాడినా ఆస్థమా తగ్గలేదు. దాంతో ఆయాసం అనిపించినప్పుడల్లా నేను " ఎరోకార్ట్ రోటాకాప్ " అనే ఇన్హేలర్ పీల్చి ఆయాసం నుంచి ఉపశమనం పొందుతూ ఉండేవాడిని. ఆస్థమాతో బాధపడడం వల్ల నేను తీపి వస్తువులను మరి చల్లిని వస్తువులను తినడానికి పూర్తిగా దూరమయ్యాను. అలాగే ఎక్కువ దూరం పరుగెత్తినా ఆయాసంతో బాధపడేవాడిని. ఈ ఆయాసం వల్ల నేను ఎండకాలం, వర్షాకాలం మరి చలికాలం అనే తేడా లేకుండా ఎల్లవేళలా జలుబుతో బాధపడుతూ ఉండేవాడిని.

ధ్యానంలోకి వచ్చి పుర్తిస్థాయిలో ధ్యానం చేసాక ఆయాసం మరి జలుబు కూడా పూర్తిగా తగ్గిపోయింది. మాత్రలు వేసుకోవడం పూర్తిగా తగ్గిపోయింది . మాత్రలు వేసుకోవడం పూర్తిగా ఆపేశాను. అలాగే ప్రస్తుతం నేను తీపి మరి చల్లని వస్తువులను కూడా ఆనందంగా తింటూ బాగా పరుగెత్తగలుగు తున్నాను. ఆ విధంగా నేను మానసికంగా, శారీరకంగా ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడిని అయ్యాను.

ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను పదవతరగతి చదువుతున్నాను. అప్పుడు సాధారణ విద్యార్థిగా వున్న నేను ‘ ధ్యానం ’ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుకుని పదవ తరగతిలో 504 మార్కులు సంపాదించాను. మా స్కూల్ వాళ్ళు 500 మార్కులకు పైగా వచ్చినవారి పేర్లను ఫోటోతో సహా 2010, మే 25 న " ఆంధ్రజ్యోతి " పేపర్లో ప్రకటించారు. ఇందుకు నా తల్లిదండ్రులతో సహా నేను కూడా చాలా ఆనందపడ్డాను. కనుక " ధ్యానం సర్వరోగ నివారణి " అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ప్రస్తుతం నేను నా స్నేహితులకూ, బంధువులకూ మరి మా ఇంటికి వచ్చిన వారందరికీ కూడా ధ్యానం గురించి తెలియజేస్తున్నాను.

 

- G. దివాకర్,
తిరుపతి
సెల్ : +91 9246982303

Go to top