" ఇది ‘ పత్రీజీ నాయన ’ కృప "

నా పేరు రామ్మోహన్రావు.

నేను ఆగస్టు 2005 సంవత్సరంలో ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. అంతకుముందు " ఆధ్యాత్మికత అంటే ప్రతిరోజూ ఉదయం 6.00 గంటల నుంచే విశేషంగా పూజలు చేస్తుండటం మరి గుళ్ళు చుట్టూ తిరగడం, నా శక్తికొద్దీ అన్నదానాలు చేస్తుండటం మాత్రమే " అనుకుని .. అవే చేస్తుండేవాడిని. అయినా కూడా ఉద్యోగరీత్యా మరి స్వభావరీత్యా నాకున్న మానసిక ఒత్తిళ్ళు, టెన్షన్, కోపం తగ్గకపోగా .. ప్రాపంచిక ప్రశాంతత కూడా కరువై ఇంట్లోవారితో పాటు మరి బంధువర్గంతో కూడా కస్సుబుస్సులాడుతూ .. జీవితం నరకంప్రాయం చేసుకుంటూండే వాడిని.

ధ్యానం విశిష్టత తెలుసుకుని .. ధ్యాన సాధన చేస్తు వుండగా ఇక క్రమంగా నాలో ఆద్భుతమైన మార్పులు .. ఆశ్చర్యజనకంగా నాలో చోటు చేసుకుంటూ వచ్చాయి. మాంసాహార శకం నుంచి మా కుటుంబమంతా శుద్ధ శాకాహారుల్లా మారిపోయాం. అందరికీ చక్కటి ఆరోగ్యం మరి ఆరోగ్యకరమైన ఆలోచనాసరళి కలిగి ఇప్పుడు మా కుటుంబమంతా "పత్రీజీ నాయన" కృప వలన పునర్జన్మ ఎత్తినట్లు .. ప్రతి క్షణం ఆనందంగా గడుపుతున్నాం.

నా భార్య శ్రీమతి రజని, కుమార్తెలు రమ్య, షర్మిళలు కూడా సంపూర్ణ ధ్యానులు మరి పరిపూర్ణ ధ్యానులు మరి పరిపూర్ణ శాకాహారులు కావడం వల్ల వారందరి సహాయ సహకారాలతో నేను ఈ రోజు భౌతికపరంగా మరి ఆత్మపరంగా ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాను.

మా ఇంటిపై 14’ x 14’ కొలతలతో రూఫ్టాప్ పిరమిడ్ నిర్మించి అందులో నిరంతరం ధ్యానశిక్షణా తరగతలు జరుపుతున్నాం. పత్రీజీ తమ స్వర్ణహస్తాలతో ఈ పిరమిడ్కి ప్రాణప్రతిష్ట చేసి "మైత్రేయబుద్ధా పిరమిడ్ " గా నామకరణం చేసారు. ఎంతోమంది ఇందులో ధ్యానంచేసి అపారంగా విశ్వశక్తిని పొంది మరి వారి వారి అనారోగ్యాలను సమూలంగా పోగొట్టుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. వీళ్ళంతా ఇలాంటి పిరమిడ్ నిర్మించిన మమ్మల్ని .. పుణ్యవచనాలతో సదా ప్రశంసిస్తూ వుంటే మాకందరికీ జన్మ ధన్యమైనట్లుగా వుంది.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఉద్యమానికే మకుటాయ మానంగా వెలుగుతూ .. అనంతమైన జ్ఞానాన్ని తనలో నింపుకుని నెలనెలా నిత్యనూతనంగా ముస్తాబవుతూ మన ముంగిట్లోకి వస్తోన్న "ధ్యానాంధ్రప్రదేశ్" ధ్యానఆధ్యాత్మిక మాసపత్రికకు బ్రహ్మర్షి పత్రీజీ తమ అమూల్యమైన సమయాన్ని ఎంత దయతో కేటాయిస్తారో .. మనందరికీ తెలుసు. " ‘స్పిరిచ్యువల్ ఇండియా’ మరి ‘మరి ధ్యానాంధ్రప్రదేశ్’ ఈ రెండూ నా రెండు కళ్ళు" అంటూ వాటి ప్రాముఖ్యతను మనకు తరుచుగా తెలియజేస్తూంటారు పత్రీజీ.

భవిష్యత్తులో ఆధ్యాత్మిక పత్రికలన్నింటిలోకి మేటి పత్రికగా నిలువబోతోన్న అలాంటి "ధ్యానంధ్రప్రదేశ్" కు" రాజపోషకుని" గా 25,000 రూపాయలను శాశ్వతనిధి రూపంలో అందజేసి ఆ పత్రిక విజయకేతనంలో నేనూ భాగస్వామిగా కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కోట్లాదిగా లాభాలు పొందుతూన్న లక్ష్యలాదిమంది ధ్యానులందరూ తప్పనిసరిగా "ధ్యానాంధ్రప్రదేశ్" కి చందాదారులుగా చేరి ఆ పత్రికను ఇంటికి రప్పించుకుంటే .. మన ప్రియతమ పత్రీజీ మన ఇంట్లో మనతో కలసి ఉన్నట్లే ..

 

- పులి రామ్మోహన్రావు,
వనస్థలిపురం
సెల్ : +91 9440288246

Go to top