" నా జీవితంలో అద్భుతమైన అనుభవం "

నా పేరు సరోజమ్మ.

" మహతి సంగీత విద్యాలయం " ద్వారా నేను సంగీత శిక్షణ ఇస్తూంటాను. నేను, పత్రిగారు ఒకప్పుడు శ్రీపాద పినాకిపాణి గారి దగ్గర సంగీత అభ్యాసం చేసాము.

ఆదోని పిరమిడ్ మాస్టర్స్ కోరిక మేరకు పిరమిడ్ ధ్యానమందిరంలో గత మూడు నెలల నుంచి నేను ఉచిత సంగీత శిక్షణ ఇస్తున్నాను. శ్రీ అన్నమాచార్యుల వారి భక్తిరస గానాలు మరి " భజగోవిందం " పై శిక్షణ ఇస్తూ పత్రిగారి జన్మదిన శుభ సందర్భాన 11 వ తేదీన " శత గళ సంకీర్తనార్చన " అనే అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించాను.

ఇలా ఒక రోజు ధ్యానమందిరంలో శిక్షణ ఇస్తూండగా ఆశ్చర్యంగా నాతోపాటు శృతితో సహా ఒక మగగొంతు సంగీత ఆలాపన చేయడం ఒక అద్భుతమైన అనుభవం ! ఆ సమయంలో నా శరీరం జలదరించి ముచ్చెమటలు పోయడంతో ఒక స్థితిలో మూడు నిమిషాల పాటు మౌనంగా ఉన్నాను. ఈ సాధకులను కూడా అడిగితే అందులో ఇద్దరు స్త్రీలు " మాకు కూడా వినిపించింది " అనగానే అందరం ఆనందాశ్చర్యాలకు లోనయ్యాము.

ఇదే విషయమై సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌ను అడుగగా " ఆస్ట్రల్ మాస్టర్స్ మీతో శ్రృతి కలిపారు. వాళ్ళ ఉనికి ఎరుక పరిచేందుకు వాళ్ళు అలా వినిపించివుంటారు " అనగానే పిరమిడ్‌లో చేసే ధ్యానంలో ఇంత శక్తి ఉందని తెలుసుకుని చాలా ఆనందపడ్డాను.

సార్ పుట్టినరోజు కార్యక్రమంలో నాకు పిరమిడ్ బహుమానంగా ఇవ్వడమే కాకుండా నా జీవితాశయం అయిన నా పాటలను రికార్డింగ్ చేయించి Dr. గంగారాం గారి చేత రిలీజ్ చేయించడం నాకు ఎంతో ఆనందం కలిగించింది.

 

- సరోజమ్మ,
ఆదోని

Go to top