" ధ్యానం ఒక మహా అక్షయపాత్ర "

నా పేరు హనిత.

చీరాల విఠల్నగర్ సాయిబాబా మందిరంలో " B. ఆదిలక్ష్మి " గారు, ప్రకాశం జిల్లా ధ్యాన భాస్కరుడు " A. శ్రీనివాస్ " గారు మండల ధ్యానం 31-4-2010 పెట్టారు. అప్పటినుంచి మండలం ధ్యానం అయిపోయినా మా ధ్యానులందరం అనుకుని కంటిన్యూ చేస్తున్నాం. అరవై నుంచి అరవైఐదు వరకు ధ్యానులందరం కలిసి ధ్యానం చేస్తున్నాం. ప్రతి ఆదివారం చిన్నపిల్లలు అరవైమంది వరకు వస్తారు. వారికి ధ్యానం నేర్పిస్తున్నాం. జగద్గురువు ఆదిశంకరాచార్యులవారు

" త్రిజగతి సజ్జనసంగతిరేకా
భవతి భవార్ణవతరణేనౌకా "

" మూడు లోకాలలో కూడానూ సజ్జన సాంగత్యమే భవసాగరం, దుఃఖసాగరం నుంచి తరింపజేసే ఏకైక మార్గం " అని చెప్పారు. అలాగే మన ప్రియతమ పత్రీజీ కూడా " సజ్జన సాంగత్యం అవసరం " అని ఎందుకు చెబుతున్నారో మాకు అనుభవపూర్వకంగా అర్థం అవుతోంది. ధ్యానం ద్వారా, ధ్యాన ప్రచారం ద్వారా అందరం ఒక నిస్వార్థపు వసుధైక కుటుంబంగా కలిసి పనిచేస్తున్నాం. ఎవరికి ఏ అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా వారికోసం మేము ప్రత్యేక ధ్యానం చేస్తున్నాం. మంచి ఫలితాలను పొందుతున్నాం. మా " శ్రీనివాస్ సార్ " ఇస్తున్న ప్రోత్సాహంతో ధ్యానప్రచారం చేస్తూ ధ్యానులను పెంచుతున్నాం. 30-3-2010 న మేమందరం పౌర్ణమి ధ్యానం చేసాం. అప్పుడు ఆ గంటలో ఎనిమిదిమందికి చక్కటి అనుభవాలు వచ్చాయి. వాటిని మీ అందరితో పంచుకునే సదవకాశం ఇచ్చిన " ధ్యానాంధ్రప్రదేశ్ " కి కృతజ్ఞతలు చెప్పుకుంటాన్నాను. ఒక్కొక్కరి అనుభవాలు చూద్దాం :

* " శిరీష " అనే చిన్నమ్మాయికి ఈ భూమిని దివ్యలోకంగా చేయడానికి భూమి మీదకు వచ్చిన దివ్యగురువు పత్రీజీ పచ్చని కొండల మీద తిరుగుతూ ఉన్నట్లుగా కనిపించారు. ఆ చిన్నారి ఆ అపురూపమైన నిస్వార్థమూర్తిని చూస్తూ తన్మయత్వంతో అలాగే కొంతసేపు ట్రాన్స్ లో ఉండిపోయింది.

* " నీరజ " గారికి సప్తఋషులు పై నుంచి మేము ధ్యానం చేస్తున్న మా ఇంటి కాంపౌండులోని ఈశాన్య భాగంలో దిగారట. దిగుతున్నప్పుడు వారిలో ఒకరు అక్కడ ధ్యానం చేస్తున్న అందరి వంక చూస్తూ ఉన్నారట.

* " సునీత " అనే మరో చిన్నమ్మాయికి బాగా ఎనర్జీస్ పాస్ అయి చాలాసేపు ట్రా న్స్ లోనే వుంది.

* " ప్రభ " గారికి కొంతమంది యోగులు మా పైన గుండ్రంగా తిరుగుతున్నట్లు దర్శనం అయింది.

* " రమాదేవి " గారికి ఒళ్ళంతా చల్లబడినంత ఎనర్జీ పాస్ అయి భరద్వాజ మాస్టర్ గారి దర్శనం అయింది.

* " హరిణి " గారికి గంథం మరి సెంటు వాసనలు అక్కడంతా వ్యాపించి కొంతసేపటి వరకు వస్తూనే వుంది.

* మరో చిన్నపాప " మధులిక " కు చుట్టూ వున్న చెట్లు, ఇళ్ళ చుట్టూ వెలుగు .. ఆరా .. ఉన్నట్లు కనిపించింది. శివయ్య గారికి ధ్యానం చేస్తున్నంతసేపూ తాను కుడివైపు నుంచి ఎడమవైపుకు, ఎడమ వైపు నుంచి కుడివైపుకూ తిరుగుతున్నట్లుగా అనిపించి ఎన్నో సంవత్సరాలుగా వున్న " సైనసైటిస్ " వ్యాధి ఆ రోజుతో పోయిందట. ఇప్పటివరకూ మళ్ళీ రానేలేదట.

* " వెంకాయమ్మ " గారికి విశ్వశక్తి పూర్తిగా నిండిపోయి శివలింగంలో ‘ ఓంకారం ’ కనిపించింది.

ఈ అనుభవాలు మా అందరిలో ఎంతో ఉత్సాహం, ఆనందం, పత్రీజీ పట్ల అంతులేని కృతజ్ఞత కలిగించాయి. నమ్మకంతో విశ్వాసంతో ధ్యానం చేస్తే " ధ్యానం ఒక మహా అక్షయపాత్ర " అని మాకు అర్థమైంది. భూమిని పునీతం చేస్తున్న పత్రీజీని స్పూర్తిగా మేమందరం ధ్యానప్రచారం చేస్తూ " ధ్యానజగత్ " కై మా వంతు కర్తవ్యం నిర్వర్తించాలని అభిలషిస్తూ కృషిచేస్తున్నాం.

 

- ఘంటా హనిత,
విఠల్నగర్, చీరాల
ఫోన్ : +91 9247466311

Go to top