" ಧ್ಯಾనం అంటే ప్రార్థన కాదు "

నా పేరు నిమ్మగడ్డ లక్ష్మీకామేశ్వరి.

మాది హైదరాబాద్. నేను గుడివాడలో జన్మించాను. 2-1-2007 నా ధ్యాన జీవితంలో మొట్టమొదటిరోజు మరి నా మనస్సు ఆనందంతో వెలుగొందిన రోజు. నా తల్లిదండ్రులు ప్రేమ కరుణామూర్తులు. నా చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక ఎరుకతో కూడి దైవభక్తి కలిగివున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. ఇంత వున్నా నా జీవితం కష్టాలతోనే గడిచిపోయేది.

తరువాత ధ్యానమిత్రులు కలవటం G.N నాయుడు గారి ప్రేరేపణతో ధ్యానం చేయడం .. మొట్టమొదటి నా ధ్యాన అనుభవం " ధ్యానం అంటే ప్రార్థన కాదు, స్తోత్రం కాదు, నామస్మరణ కాదు, మంత్రజపం కాదు " అని తెలుసుకున్నాను. మన శరీరంలోని అంతర్భాగంలో నుంచి వచ్చే శ్వాస బాహ్యంలోకి వదలటం .. బాహ్యంలోంచి తీసుకున్నశ్వాసను అంతరంలోకి తీసుకునే ప్రక్రియను గమనిస్తూ నిమగ్నమవ్వటం .. అంటే శ్వాస మీద ధ్యాస అని.

నేను గత పది సంవత్సరాలుగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాను. దానితో నా ఆరోగ్యం క్షీనిస్తూ వచ్చింది. షుగర్ వలన నాకు తలనొప్పి ఎక్కువగా వస్తుండేది. తలనొప్పి వచ్చినప్పుడు తట్టుకోలేకపోయేదాన్ని. అలా ఐదు సంవత్సరాలుగా బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. డాక్టర్లు చెకప్ చేస్తే " ఏమిలేదు .. అంతా బాగానే వుంది " అని చెప్పేవారు. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేయడం మొదలుపెట్టానో అప్పటినుంచి నాకు తలనొప్పి తగ్గడం మొదలుపెట్టింది. మెల్లగా ఇప్పుడు తలనొప్పి అంతా తగ్గిపోయింది. దీనివలన నాకు " ధ్యానం చేయడం వలన మనలోని రోగాలను మనమే ఏ మందులు వాడకుండా తగ్గించుకోవచ్చు " అని తెలిసింది.

ఏ పనినైనా మంచి మనస్సుతో ఏకాగ్రతతో చేసినట్లైతే అది తప్పకుండా నెరవేరుతుంది. ఏకాగ్రతకు ధ్యానానికి చాలా తేడా వుందని మనం తెలుసుకోవాలి. ధ్యానం అంటే పూర్తి మనస్సుతో చేసే గాఢ చింతనం. సాధరణ ఏకాగ్రత కన్నా ఇది ఎంతో ప్రత్యేకమైంది.

సత్యమార్గంలో నడవడం ప్రతి మనిషి ధర్మం, తన కుటుంబాన్ని పోషించుకోవడం ధర్మం. మన జీవనానికి కారణమై మనకు గాలి, నీరు, వెలుతురు, ఆహారాన్ని అందించే ఈ ప్రకృతిని కాపాడటం కూడా మన ధర్మం. ప్రకృతి బాగుంటే మనం బాగుంటాం. మన ఆరోగ్యాలు బాగుంటాయి. మనమందరం అనారోగ్యాలకు గురికావడానికి కారణం ప్రకృతిని మనం కాపాడలేక పోవటం. ప్రేమ, ధర్మం, సత్యం, దానం, అహింస ప్రతి మనిషి పాటించాలి.

నా జీవితంలో అతిముఖ్యమైన మలుపుకి మరి ధ్యాన మార్గంలోకి నడవడానికి కారణం నా భర్త N. సోమశేఖరశాస్త్రి గారు, పిల్లలు దేవి, స్వప్న, హనుమాన్ మరి G.P. నాయుడుగారు, G. శ్రీనివాసరావు గారు, జయలక్ష్మి గారు తదితరులకు నేను సర్వదా కృతజ్ఞురాలిని.

 

- నిమ్మగడ్డ లక్ష్మీకామేశ్వరి,
హయత్నగర్ మండలం, లెక్చరర్స్ కలనీ, హైదరాబాద్
సెల్ : +91 9059600088

Go to top