" ధ్యానం చేసి చర్మ వ్యాధిని తగ్గించుకున్నాను "

నా పేరు కల్పన.

మాది మహబూబ్ నగర్ జిల్లా .. “ కల్వకుర్తి “ సమీపంలోని “ గుండ్లగుంటపల్లి “ అనే మారుమూల గ్రామం. ప్రస్తుతం నేను ఒక పాఠశాలలో పాధ్యాయురాలిగా పని చేస్తున్నాను.

నాలుగు సంవత్సరాల క్రితం నేను ఒక రకమైన చర్మవ్యాధికి గురికావడం వల్ల .. నా ముఖంతో సహా శరీరం అంతా కమిలి పోయినట్లు నల్లటి నలుపు రంగులోకి మారిపోయింది. అంతే కాకుండా నేను వాడిన స్కిన్ ఎలెర్జీ మందులు రియాక్షన్ కావడం వల్ల నేను తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాను. ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి మళ్ళీ వేరే రకమైన ఆల్లోపతి మందులు వాడినా .. దాదాపు సంవత్సరం పాటు నేను మంచానికే పరిమితం అయ్యాను.

కొన్నాళ్ళ తరువాత ఆయుర్వేదం మందులు వాడడం మొదలుపెట్టాను. దీనివల్ల నా సమస్య కొద్దిగా తగ్గినప్పటికీ .. సైడ్ ఎఫక్ట్స్ చాలా ఉండేవి.

9 ఫిబ్రవరి, 2009 వ తేదీన .. హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ “ ధూళిపూడి చంద్రశేఖర్ “ గారు వచ్చి, మా ఊరి వాళ్ళందరిచేత ధ్యానం చేయించారు. అయితే నాకు నడుము నొప్పి వుండటం వల్ల .. “ ఎక్కువ సేపు కూర్చోగలనో లేదో “ అనే సందేహం తోనే వెళ్ళి కూర్చున్నాను. ఆ రోజు ధ్యానంలో హాయిగా రెండు గంటలపాటు అలాగే కూర్చుండి పోయి .. అద్భుతమైన విశ్వశక్తి పొందాను.

చంద్రశేఖర్ గారి సూచనల మేరకు 41 రోజులు ధ్యానం చేయగా ఆశ్చర్యకరంగా నా నడుము నొప్పి తగ్గిపోయింది , అప్పటి నుంచి నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తూ .. ధ్యానంలో చేరిన తర్వాత మాస్టర్స్ చెప్పిన ప్రసంగాలను విని “ హింస చేయకూడదు “ అని నిర్ణయించుకుని మాంసాహారాన్ని నేను పూర్తిగా మానివేసాను. దాంతో నా అనారోగ్య సమస్యలతో పాటు .. నా కమిలిపోయిన చర్మం కూడా మెల్ల మెల్లగా కాంతిమయం అవుతూ .. ఇప్పుడూ అల్లర్జీ అంతా పూర్తిగా తగ్గిపోయింది , నన్ను మళ్ళీ అన్నిరకాలుగా పరీక్షించిన తరువాత “ ఇది నిజంగా వైద్యపరమైన అద్భుతం “ అంటూ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు.

ఇదివరలో అనేక రకాల అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ .. నలుగురిలోకీ వెళ్ళలేక ఎంతో ఆత్మనూన్యతా భావంతో కుమిలిపోయే నేను .. ఈ రోజు ఇంత చక్కగా ఉద్యోగం చేసుకుంటూ .. “ సమాజంలో నాకంటూ ఒక గుర్తింపు పొందాను “ అంటే .. అది పూర్తిగా ధ్యానం వల్లనే సాధ్యం అయ్యింది . ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రీజీకీ, దానిని మా వరకు చేర్చిన కల్వకుర్తి మాస్టర్ “ రమేశ్ “ గారికీ మా కుటుంబ సభ్యులు అందరం హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.


- K. కల్పన,
కల్వకుర్తి, మహబూబ్ నగర్ జిల్లా

సెల్ : +91 9441381727

Go to top