" ధ్యానం అందరికీ చాలా అవసరం "

 

నా పేరు నివేదిత.

గత ఇరవై సంవత్సరాలుగా మేము అమెరికాలో నివాసం ఉంటున్నాము. మా అక్క మరి హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ " M. నిర్మలాదేవి " ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశించాను. మా కుటుంబ సభ్యులం అందరూ ఈ ధ్యానంలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకుని " ముఖ్యంగా.. ఎంతో బిజీలైఫ్ తో ఉండే అమెరికన్లకు, ప్రవాస భారతీయులకూ, దీనిని చేర్చాలి " అన్న తపనతో ఉన్నాము.

లాస్ ఏంజిల్స్ లో ఉన్న మా స్వంత ఇంటి రెనొవేషన్ సమయంలో నూతనంగా ఒక హాల్ నిర్మించి దానిని ఏదైనా మంచి పనులకు వినియోగించాలి అనుకోవడం జరిగింది. ఈ క్రమంలో Dr. న్యూటన్ కొండవీటి మరి లక్ష్మీ న్యూటన్ లు USA వస్తున్నారని మా అక్క ద్వారా తెలుసుకుని .. వారిద్దరితో లాస్ ఏంజిల్స్ లో మొట్టమొదటి ధ్యానశిక్షణా కార్యక్రమాన్నిమా క్రొత్త హాల్ లో ఏర్పాటు చేసాము.

మా వారు శ్రీ సురేష్ తమ్మెవార్ స్నేహితులైన ప్రవాస భారతీయులేకాక, ఇతర దేశాలకు చెందిన నలభై మంది మాస్టర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని సులభ సాధ్యమైన " శ్వాస మీద ధ్యాస " ధ్యాన విధానానికి ఆశ్చర్యపోయారు.

డాక్టర్స్, ఇంజనీర్స్ మరి ఇతర ఉన్నత స్ధానాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళంతా .. ఈ కార్యక్రమం పట్ల తమ సంతోషాన్ని తెలియజేసారు. " మళ్ళీ మళ్ళీ ఇలాంటి మంచి కార్యక్రమాలను చేసుకుందాం " అని మమ్మల్ని ప్రోత్సహించారు.

ప్రతి ఒక్కరికీ అవసరమైన ఇలాంటి అద్భుతమైన ధ్యానవిద్యను ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందజేస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీకి, Dr. న్యూటన్ మరి లక్ష్మీ న్యూటన్ లకు కృతజ్ణతలు.

 

- నివేదిత తమ్మెవార్,
లాస్ ఏంజిల్స్,
USA
E-mail : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top