" నేను ' శక్తిక్షేత్రాన్ని' అని తెలుసుకున్నాను "

 

నా పేరు సునీత.

26-09-2007 పౌర్ణమి రోజు నేను వైజాగ్ పిరమిడ్ మాస్టర్ " రత్న " గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని .. ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. ధ్యానం వలన ఎంతో మనశ్శాంతి మరి ఆనందాన్ని పొందుతూ .. గత ఇరవై సంవత్సరాల నుంచి నేను వాడుతున్న ధైరాయిడ్ మాత్రల దగ్గరనుంచి అన్ని రకాల మందులు వాడడం మానివేసాను. ధ్యానంలో భగవద్గీత శ్లోకాలు, " పిరమిడ్ అంటే శ్రీ చక్రం " అని ఎవరో చెప్తునట్లు మాటలు ద్వారా విన్నాను.

ఒక రోజు ధ్యానంలో " నువ్వు మామూలు మనిషివి కావు ; శక్తి క్షేత్రానివి ; నీ శక్తి అపారం " అని వినిపించి .. నా శరీరం నుంచి వణుకు ప్రారంభమయి తర్వాత నిదానంగా తగ్గింది.

బ్రహ్మర్షి పత్రీజీని 2007 .. కార్తీక పౌర్ణమి రోజు .. " జయలక్ష్మి గార్డెన్స్ " లో " ధ్యాన భారత్ " ఉత్సవాల్లో చూసాను. ఆయన కరచాలనం ద్వారా గొప్ప గురువును సంపాదించుకున్న సంతోషం కలిగింది.

మా స్వగ్రామం " మంత్రిపాలెం " లో R. వెంకటేశ్వరరావు గారు మరి రేపల్లె సుధాకర్ గారి ద్వారా ఎంతో మంది మాస్టర్స్ తో ప్రతి ఆదివారం క్లాసులు చెప్పించాము. స్వర్గీయ రేపల్లె సుధాకర్ గారు రేపల్లె – చుట్టుప్రక్కల గ్రామాలకు ధ్యానం గురించి తెలియజేసి .. ప్రతి వారిలో ధ్యాన పిపాసను పెంచి ఎందరినో ధ్యానాభిలాషులుగా తయారుచేసి, చిన్న వయస్సులోనే ఆత్మలోకాలకు చేరి మా అందరి హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. ఈ ధ్యాన నేస్తానికి రేపల్లె ధ్యానులందరి తరపున ఆత్మ – సుమాంజలులు సమర్పించు కుంటున్నాను.

మా స్వగ్రామం మంత్రిపాలెంలో పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాం. శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఎవ్వరైనా తమ జీవితాన్ని ఆనందంగా అనుభవించగలుగుతారు. ఎన్ని సమస్యలు అయినా తట్టుకునే శక్తి వస్తుంది.

 

- సునీత రాంబాబు,
మంత్ర్రిపాలెం, గుంటూరు

సెల్ : +91 9959153724

Go to top