" గురుదేవులతో నా తిరుపతి యాత్ర "

 

నా పేరు వెంకటలక్ష్మి.

జీవిత ప్రయాణంలో అపురూపంగా లభించే కొన్ని మహత్తర క్షణాలను మనం జీవితాంతం పదిల పరచుకుంటాం ! ఆ అదృష్టం పిరమిడ్ మాస్టర్ నైన నాకు పత్రీజీ అనుగ్రహించారు.

సామాన్య గృహిణిని అయిన నేను మా కుటుంబంతో కలిసి జూలై 13వ తేదీన సాయంత్రం " తిరుమల ఎక్స్ ప్రెస్ " లో తిరుపతికి వెళ్తూండగా .. మా బోగీలో బ్రహ్మర్షి పత్రీజీ ప్రత్యక్షం కావడం, మరి కొంతసమయం మాతో గడపడం మా అదృష్టం !

" ' గురుపౌర్ణమి ' రోజు తిరుమలలో పత్రీజీ దర్శన భాగ్యం దగ్గరగా దొరుకుతుందో .. లేదో .. " అనుకుంటూ భారంగా ప్రయాణం సాగిస్తున్న మాకు .. పత్రీజీ ఆకస్మిక దర్శనంతో గొప్ప పెన్నిధి దొరికినట్లయి మా జీవితంలో ఒక మహత్తర సంఘటనగా నిలిచిపోయింది.

బోగీలో సీట్ల వద్దకే కూర్చున్న పత్రీజీ .. " ధ్యానం గురించి ఎవరి ద్వారా తెలుసుకున్నారు ? " అంటూ ఒక స్నేహితునిలా మాతో ఆప్యాయంగా మాట్లాడుతూ .. నేను వారికి సమర్పించిన పెరుగువడను ఎంతో ఇష్టంగా స్వీకరించారు.

" ఏం మేడమ్ ? మీకు తృప్తి కలిగిందా ? ! " అని వారు నన్ను కరుణతో అడిగిన తీరు.. ఆనాటి శబరిని శ్రీరామచంద్రుడు అనుగ్రహించిన వైనం నాకు జ్ణప్తికి తెచ్చింది !

తల్లీ, తండ్రీ, గురువూ దైవం అన్నీ మూర్తీభవించిన దివ్యపురుషులు బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మాభివందనాలు !

 

- K. వెంకటలక్ష్మి,
సెల్ : +91 9949463947

Go to top