" ధ్యానాన్ని ఆశ్రయిస్తేనే సంపూర్ణ ఆరోగ్యం "

 

"నా పేరు Dr.G.మల్లికార్జున రావు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ విభాగంలో పదిహేను సంవత్సరాలుగా ఉన్నాను."

" ధ్యానం గురించి సదాభిప్రాయం ఉన్నా భక్తి మార్గంలోనే ఇంతవరకూ ప్రయాణం చేశాను. అయితే తొలిసారిగా ధ్యానం గురించి నా స్టూడెంట్ Dr.హరి ద్వారా ఏడు సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను."

" అయితే 2004 సెప్టెంబర్ 3న "ల్యాప్రోస్కోపీ సర్జరీ" మొదలైన శిక్షణకై చెన్నై నగరంలోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ నిర్వహించిన మూడురోజుల వర్క్‌షాప్‌కు వెళ్ళినప్పుడు సాయంకాలం 4.00 గంటలకు 'పారిస్'లో మెడిటేషన్ క్లాసు ఉందని Dr.హరి చెప్పినప్పుడు "సరే, రూమ్‌లో టి.వి. చూసుకుంటూ ఉండేదానికంటే మెడిటేషన్ మేలుకదా" అని నేనూ, మా ప్రోఫెసర్, సర్జన్, Dr.రామనాథ్ మరి ఇంకొక సహ డాక్టర్ కలిసి వెళ్ళాం. అక్కడ చెన్నై పిరమిడ్ మాస్టర్ జగదీశ్ చెప్పిన అనుభవాలు మాకు నమ్మశక్యంగా అనిపించలేదు. అయితే పారిస్‌లో క్లాస్ జరుగబోతున్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిరమిడ్ కుటుంబం ఆదరణ, మర్యాద, నన్నూ, నా సహ డాక్టర్లనూ ఎంతో ఆకట్టుకున్నాయి.

" Dr.హరి గారు పిరమిడ్ క్యాప్ తలపై ఉంచి శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్పి సూచనలు ఇస్తూ వచ్చారు. కొద్దిసేపట్లో ఎంతో తేలికగా తయారయ్యాను. ఎదురుగా మాస్టర్ శివ బాల యోగి గారు సజీవంగా ఉన్నట్లు అనుభవం కలిగింది. అలానే నా వైపు చూస్తూ నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎంతో ప్రశాంతతా, హాయీ నన్ను చుట్టుముట్టాయి. ఇంత చక్కటి అనుభవం కలగడం నా జీవితంలో ఇదే మొదటిసారి. Dr.హరి కళ్ళు తెరవమని చెప్పినప్పుడు అయిష్టంగానే కళ్ళు తెరిచాను.

ఎంతో ఫాస్ట్, డైనమిక్ సర్జన్‌గా మంచి పేరున్న నాకు అప్పుడే తెలిసింది. "నేను తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది" అని. "ధ్యానం మీద పత్రీజీ గారి పుస్తకాలు చదివాను. ఎంతో సరళంగా, తేటతెల్లంగా ఉన్నాయి. పత్రిగారు నిజంగా అద్భుతమైన గురువు."

" Dr.హరి వాస్తవానికి నా స్టూడెంట్ అయినా అతను ఇంత అద్భుతమైన శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని నాకు పరిచయం చేసి, పిరమిడ్ ఫ్యామిలీతో ప్రత్యేక అనుభవాన్ని కల్గించినందుకు వారికి ఎంతో కృతజ్ఞుడిని. ధ్యానం విషయంలో Dr.హరికి నేను స్టూడెంట్ అయిపోయాను. ఇంకో విషయం ...Dr.హరి 7 సంవత్సరాల క్రితమే ధ్యానం గురించి చెప్పారు, "అప్పటి నుండి సాధన చేసి ఉంటే ఈ పాటికి నేను కూడా 'గ్రేట్ పిరమిడ్ మాస్టర్' లా అయ్యుండేవాడిని కదా" అనుకున్నాను.

"ఆ రోజు నుండి నేను క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. మైండ్ ఎంతో ప్రశాంతంగా ఉంటోంది; కోపం తగ్గింది, ధ్యానాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను".

నా సందేశం:- చీటికి మాటికీ మందులు వాడకుండా ప్రతి రోగీ ధ్యానాన్ని ఆశ్రయిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ధ్యానం వల్లే ముక్తి లభిస్తుంది. పెప్టిక్ అల్సర్, మొదలైన మానసిక జనిత శారీరక రుగ్మతలకు సర్జరీ అవసరం లేకుండా ఉపశమనం పొందవచ్చని ఒక సర్జన్‌గా నా విన్నపం. ప్రతి వైద్యుడూ విధిగా రోగికి ధ్యాన శిక్షణ ఇవ్వాలి.

"ఇంతటి చక్కని ధ్యానం నా జీవితంలో ఓ భాగమయినందుకు ఇన్‌డైరెక్టుగా పత్రీజీకీ, మరి డైరక్టుగా Dr.హరి గారికి కృతజ్ఞతలు."

 

Dr.G.మల్లికార్జున రావు
అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి
కర్నూల్

Go to top