" ఆటో రైటింగ్ "

"దివ్య జ్ఞాన ప్రకాశానికి ఆటోమేటిక్ రైటింగ్ ఒక మంచి అవకాశం అని" పత్రీజీ గారు చెప్పారు. ఈ స్ఫూర్తితో నేను కూడా Automatic Writing ప్రక్రియలో ఆసక్తి చుపాను.

డిసెంబర్ 1999 మా నాన్నగారు ధ్యానం చేస్తూ తన చేతిలో ఓ పుస్తకం పట్టుకుని పెన్ను రాసే విధంగా తన వేళ్ళ మధ్య పెట్టుకుని కూర్చున్నారు. గంట గడిచినా పేపర్ మీద పెన్ను కదలలేదు. నాన్న గారి ధ్యానం తర్వాత నేను, "నువ్వేం చేశావు?" అని అడిగాను. నాన్న గారు దీనిని Automatic Writing అంటారనీ, ఇందులో తనకి ఇంకా ప్రవేశం కాలేదని చెప్పారు. కుతూహలంతో నేను కూర్చున్నాను. ఆశ్చర్యం. శ్రీ సాయి మాస్టర్ వచ్చి తన పేరు రాసి, సంతకం పెట్టి వెళ్ళారు. అప్పుడు మా నాన్నగారు "నేనెవరు? నేను ఎందుకు వచ్చాను? నేను ఏ లోకవాసిని?" అని నా గురించి ప్రశ్నలు వ్రాసారు. శ్రీసాయి మాస్టర్ మళ్ళీ వచ్చి నేను 'నాగ మాత'ననీ, నేను 'నాగలోక వాసి 'ననీ' నేను ధ్యాన ప్రచారానికి వచ్చాననీ చెప్పారు. ఇలా నా ప్రక్రియ అద్భుతంగా సాగింది. శ్రీ శేఖర్ మాస్టర్ ఎన్నో ఆధ్యాత్మిక ప్రశ్నలకు సమాధానాలను ఆటోరైటింగ్ ద్వారా ఇప్పించారు. ఈ సమాధానాల వల్ల ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు తెలిసాయి.

శ్రీ సాయి మాస్టర్, శ్రీ బుద్ధ మాస్టర్ , శ్రీ లాహిరి మాస్టర్ తదితర మాస్టర్స్ ఎంతో విలువైన మెస్సేజ్‌లు ఇచ్చారు. శ్రీ కృష్ణ మాస్టర్ భగవద్గీత గురించి ఇచ్చిన వివరణ ఎంతో విలువైంది. ఇలా ఆటోరైటింగ్ ద్వారా ఎన్నో జ్ఞాన రత్నాలను నేను తెలుసుకున్నాను.

నేను ధ్యానంలో కూర్చున్న తరువాత, సూక్ష్మశరీరయానం జరిగిన వెంటనే సంబంధిత మాస్టర్ యొక్క చైతన్యం నా బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి వచ్చి, ఆటోరైటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నాలాగే అందరూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తున్నాను.

 

- P.సౌమ్య,
L.B.నగర్, హైదరాబాద్

Go to top