" బ్రిడ్జి స్కూల్ "
" ఈ స్కూల్ అద్భుతం, ధ్యాన పిల్లలు అద్భుతం "

నా పేరు శ్యాంబాబు. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణం. బ్రిడ్జి స్కూలు ... శ్రామిక బాలికల విద్యా వికాసకేంద్రం .. లో క్యాంప్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నాను.

మారుమూల గిరిజన, కొండకోన, కుగ్రామాలలో పనిచేస్తూ బడికి పోనటువంటి శ్రామిక బాలకలతో గత ఐదు సంవత్సరాల నుండి బ్రిడ్జి స్కూల్ నిర్వహిస్తున్నాం.

బ్రిడ్జి పాఠశాలకు వచ్చిన పిల్లలు ఏడ్వడం, గోడలు దూకి పారిపోవడం, చెప్పాపెట్టకుండా బయటకు వెళ్ళడం, తల్లిదండ్రులు పిల్లలను ఇంటికి పంపించమని గొడవ చేయడం, ఎన్నో సమస్యలను ప్రతి బ్యాచ్‌లోనూ ఎదుర్కొనేవాళ్ళం.

ఒకరోజు ఇల్లెందులోని పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు గారు కలిసి " ధ్యానం చేస్తే మీ సమస్యలు అన్నీపోతాయి. మీరు వెంటనే మీ పిల్లల చేత ధ్యానం ప్రారంభించండి " అని మరుసటిరోజు పిరమిడ్ మాస్టర్స్ సుదర్శన్, ఖండ్రిక వెంకటరమణ గారితో కలిసి మా పాఠశాలలో ధ్యాన శిక్షణా తరగతులు ప్రారంభించారు.

విద్యార్ధుల క్రమం తప్పకుండా మా టీచర్ల సహాయంతో ప్రతిరోజూ ధ్యానం చేస్తూనే ఉన్నారు. కానీ, నేను అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు మా మండలంలో గ్రామీణ క్రీడా పోటీలలో మా బ్రిడ్జి స్కూలు బాలికలు పాల్గొని ప్రధమ స్థానంలో వచ్చారు. ఆ విషయం వారు నాకు చెప్పగానే నేను సరిగ్గా వినలేదు. వారిని జిల్లా పోటీలకు పంపమని అధికారులు ఆదేశించారు. " పిల్లలను పంపడం వలన డబ్బు దండగ జిల్లా స్థాయిలో క్రీడాకారులతో ఓటమి తప్పదు " అని " ఎందు వృధా శ్రమ? " అని వద్దని పిల్లలకు చెప్పాను. వాళ్ళు వినలేదు. " మేమూ ఫస్ట్ వస్తాం సార్ " అని వాళ్ళు వేడుకున్నారు. వారి మాటలకు జాలిపడి పంపించాను. వారు సాయంత్రం తిరిగి వచ్చి " జిల్లాలో మనమే ఫస్ట్ వచ్చాం. అందరినీ ఓడించాం. " అని చెప్పగా ఆశ్చర్యపోవడం మా వంతు అయ్యింది.

ఈ సంఘటన జరిగిన తరువాత నా మనస్సులో ఎందుకో " ధ్యానానికీ పిల్లల విజయాలకూ సంబంధం ఉంది " మా క్యాంపు టీచర్లు మా సమీక్ష సమావేశంలో ధ్యానం చేస్తున్నప్పుడు మూలగడం, ధ్యానం అయిన తర్వాత కూడా స్పృహలోకి రాకుండా ఉండేవాళ్ళు ఈ విషయం అంతా నాకు మధ్య మధ్యలో జ్ఞాపకం వస్తూండేది.

ఒకరోజు పిల్లలు ధ్యానం చేసిన తరువాత నేను పిల్లలతో మీకు " ధ్యానంలో ఎవరు కనిపించారు? " అని అడిగితే " మాకు హనుమంతుడు కనిపించాడు. మేము ఆయనతో ఆడుకున్నాం " అని చెప్పారు. జిల్లా అధికారుల నుండి రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్ళడానికి గాను ఒక్క అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి పేరు ' కాంతామణి ', " ఆమెను పంపించండి " అన్నారు.

ఖమ్మం జిల్లా నుండి మొత్తం 40 మంది బాలబాలికలు తిరుపతి బయలుదేరి వెళ్ళారు. నేను మాత్రం అమ్మాయికి వీడ్కోలు పలుకుతూ " వేళకు ధ్యానం చేయడం మరచిపోవద్దు " అని చెప్పాను. మూడవరోజు నాకు ఫోన్ రాగా " ఈ కొత్త నెంబర్ ఎవరిదా? " అని చెప్పి మాట్లాడగా ఆశ్చర్యపోవటం మా వంతు అయ్యింది.
రాష్ట్రస్థాయిలో ఖమ్మం జిల్లా నుండి 40 మంది పట్టణ గ్రామీణ ప్రాంతాల నుండి పాల్గొన్న వారి నుండి గిరిజన కుగ్రామం నుండి వచ్చి రాష్ట్రస్థాయిలో జిల్లాకు వచ్చిన ఒకే ఒక బంగారు పతకాన్ని మా శ్రామిక బాలిక పొందటం మాకెంతో గర్వకారణం అయ్యింది.

ఈ విషయమై పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వర్లు మాస్టర్ గారిని అడగగా " ధ్యానం వలన అద్భుత ఫలితాలు వస్తాయి " అని చెప్పారు. " ధ్యానం చేసే పిల్లలు జరుగబోయే దానిని ముందే చెబుతారు. అవి నిజం అవుతాయి " అని చెప్పారు.


- శ్యాంబాబు,
ఖమ్మం

Go to top