" మార్క్సిస్టు కమ్యూనిజం నుండి బుద్ధిస్ట్ కమ్యూనిజం వరకు "

నా పేరు దుర్గారెడ్డి. మెదక్ జిల్లా సిద్ధిపేట నివాసిని. జనవరి ఒకటవ తేదీ 2006 న గజ్వేల్‌లోని పిరమిడ్ మాస్టర్స్ బాల్‌రెడ్డి మరి నర్సింలు గార్ల ద్వారా నాకు ధ్యాన పరిచయం జరిగింది.

నేను ధ్యాన ప్రపంచానికి పరిచయం కావడానికి ముందు కమ్యూనిస్టు ... పీపుల్స్ వార్ ... పార్టీలో పనిచేసేవాడిని. జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితం గడపాలనుకుంటూన్న తరుణంలో నేను తీవ్ర అనారోగ్యానికి గురికావడం జరిగింది.

కిడ్నీలో రాళ్ళు, యూరినరీ ఇన్‌ఫెక్షన్ (ప్రోస్టేట్)తో ఎన్నో ఇబ్బందులు పడి అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేదం లాంటి ఎన్నో ఔషధాలు వాడాను. అలాగే నాకు శ్వాస సరిగ్గా ఆడకపోయేది. అందుకోసం ప్రతిరోజూ మూడుసార్లు రెండు రకాల ఇన్‌హేలర్స్ మరి మందులు వాడేవాడిని. ఒకానొక దశలో ఈ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే తలంపు కల్గింది. అయితే, నా అదృష్టం బాగుండి జనవరి ఒకటి 2006 న 'శ్వాస మీద ధ్యాస' ధ్యాన పరిచయం జరిగింది. సిద్ధిపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బండిపల్లి రామయ్య, శ్రీ భీమేశ్వర ప్రసాద్ గార్ల సలహాలు, మార్గదర్శకత్వంలో ధ్యానంలో ఎంతో పురోగతి సాధించాను.

ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో అస్వస్థతతో ఉన్న నేను ధ్యానంతో నాలోని జబ్బులన్నింటినీ పోగొట్టుకుని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తయారయ్యాను. ఇప్పుడు ఎలాంటి మందులూ వాడడం లేదు. ప్రశాంత జీవితం గడుపుతున్నాను. సీనియర్ మాస్టర్ల సూచన మేరకు మార్చి నెలలో సతీ సమేతంగా భీమవరం శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారి మూడురోజుల ధ్యాన శిబిరానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకే సిట్టింగ్‌లో అయిదు గంటలు కూడా కూర్చోగలుగుతున్నాను. భీమవరంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అద్భుత అనుభవం జరిగింది. గతంలో నేను మోకాలి నొప్పుల ... joint pains ... తో బాధపడేవాణ్ణి. భీమవరంలో ధ్యానం చేస్తూండగా ఒక ఆస్ట్రల్ మాస్టర్ నా కుడి మోకాలి వద్ద పట్టుకుని గట్టిగా నొక్కాడు. ధ్యానం నుండి లేచిన తర్వాత నా మోకాలి నొప్పి తగ్గిపోయింది. అంతా కూడా ధ్యాన మహిమ.

అతి తక్కువ సమయంలో ధ్యానం వల్ల ఎంతో లబ్ధి పొందిన నేను నాలాంటి ఎంతోమందికి స్పూర్తిని ఇవ్వాలనే సత్‌సంకల్పంతో శక్కర్‌నగర్, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ మొదలైన పట్టణాలలో సీనియర్ మాస్టర్స్‌తో కలిసి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. సీనియర్ మాస్టర్స్‌తో ధ్యాన ప్రచారంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కల్గించింది. బ్రహ్మర్షి గారి ఆశయమైన "ధ్యాన జగత్" స్థాపన కోసం నావంతు కృషిచేయడానికి ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాను.

ఈ నెలలో షామీర్‌పేటలో జరిగిన "ధ్యానప్రస్థ" కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ భీమేశ్వర ప్రసాద్ గారి ద్వారా పూజ్య గురుదేవులు బ్రహ్మర్షి పత్రీజీ గారి పరిచయం జరిగింది. మొట్టమొదటిసారి గురువు గారితో పరిచయం జరిగిన ఆ మధుర క్షణాలను నేను జీవితంలో మరచిపోలేదు.

"శ్వాస మీద ధ్యాస" ధ్యానంతో ఈ ప్రపంచాన్ని 'ధ్యానమయం' గా 'జ్ఞానమయం'గా మార్చడానికి నిరంతరం పరిశ్రమిస్తూన్న పూజ్య గురుదేవుల పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ....

 

- కాసుల దుర్గారెడ్డి,
11-1-98/1/A, భారతి నగర్, శివాలయం దగ్గర, సిద్ధిపేట, మెదక్ జిల్లా
ఫోన్ : +91 9866548099

Go to top