" ధ్యానంలో కడుపునొప్పికి ఆపరేషన్ "

నా పేరు హజరాబేగం. నేను రాయగడ న్యూ కాలనీలో ఉంటున్నాను. G.పద్మావతి గారు 15-3-06 నుండి ధ్యానం నేర్పారు. ప్రతిరోజూ గంట నుంచి రెండు గంటల వరకు ధ్యానం చేస్తున్నాను. నేను సంవత్సరం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాను. ఇంగ్లీషు మందులు వాడాను. తగ్గలేదు. ఆపరేషన్ చెయ్యాలన్నారు. ఆపరేషన్ అంటే నాకు భయం. పద్మావతి గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని చేస్తున్నాను.

నాలుగు రోజుల తరువాత ఉదయం 6.00 గంటలకు తెల్లబట్టలు వేసుకుని ఇద్దరు డాక్టర్లు "కడుపు చెక్‌చేసి ఆపరేషన్ చేస్తాము కదలవద్దు" అని చెప్పారు. ఇంజక్షన్ చేసి ఆపరేషన్ చేసారు. మైలతో వున్న గడ్డ తీసి చూపించారు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. "మీ ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా చేస్తాము" అని చెప్పారు. నా టెన్షన్ అంతా తగ్గిపోయింది. జీవితం ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా ఉన్నాము.

నేను మాంసాహారం తినడం మానివేసాను. అందరికీ మాంసాహారం తినడం మానేయాలని చెప్తున్నాను. ఇప్పటికి ఆరుగురు ముస్లిం స్త్రీలను మాంసాహారం తినటం మాన్పించి ధ్యానం చేయిస్తున్నాను. అప్పాజీ గారి బృందం ధ్యాన తరగతి నిర్వహించినప్పుడు ముస్లిం స్త్రీలు వచ్చి క్లాసు విని ఎంతో ఆనందంతో ధ్యానం చేస్తారు. నా భర్త చేత ధ్యానం చేయిస్తున్నాను. నాకు ధ్యానంలో ఈశ్వరుడు కనిపించి ఆరోగ్యం బాగుంది కదా అని పలకరించారు.

- హజరాబేగం,
న్యూ కాలనీ, రాయగడ, ఒరిస్సా

Go to top