" ఇంటింటా ధ్యానాంధ్రప్రదేశ్ "

నా పేరు లలిత.

నాకు " ఆనాపానసతి " ధ్యానం గురించి 2007 లో తెలిసింది. విజయవాడ శ్రీ జక్కారాఘవరావు గారు " పిరమిడ్ హౌస్ " స్ధాపించి పది సంవత్సరాలు అయిన సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ లో జరిగే ఫంక్షన్ గురించి పేపర్ లో ఇచ్చిన చాలా చిన్న ప్రకటన చూసి వెళ్ళి .. అక్కడ నేను ధ్యానం నేర్చుకున్నాను. ఆ తరువాత మా ఇంట్లో, మా నాన్న గారి ఇంట్లో మరి శివాయంలో కూడా నేను అనేక ధ్యానం క్లాసులు పెట్టించాను.

ఆ తరువాత విజయవాడ మాస్టర్స్ సహాయ సహకారాలతో 2010 లో విజయవాడ .. " సిద్ధార్ధ కాలేజీ " లో ధ్యానాన్ని ప్రవేశపెట్టి స్టాఫ్ అందరితో " ధ్యానాంధ్రప్రదేశ్ " చందాలు కట్టించాను. ధ్యానంతో పాటు, ఆత్మ జ్ణానం అన్నది కూడా వాళ్ళకు మనం తప్పకుండా అందజేయాలి. ప్రస్తుత తరుణంలో సాధకులకు వచ్చే అనేకానేక సందేహాలకు చక్కటి సమాధానాలను అందించగలిగే " ఉత్తమ ఆధ్యాత్మిక పత్రిక " గా మన " ధ్యానాంధ్రప్రదేశ్ " నిలుస్తోంది అనడంలో అతిశయోక్తి లేదు ! ఎన్నెన్నో సంస్ధల పత్రికలను చదివే నేను .. ఈ తేడాని ఎంతగానో అర్ధం చేసుకున్నాను.

అందుకే ధ్యాన ప్రచారం చేస్తోన్న మాస్టర్స్ అందరూ .. విధిగా ధ్యానాంధ్రప్రదేశ్ కూడా ప్రతి ఒక్కరి దగ్గరకు చేరేలా చూడాలి. టీ పాయ్ పై అది కనబడుతూంటే .. " ధ్యానం చేయాలి " అన్న ఎరుక మనకు కలగడమే కాకుండా .. మనం సతమతమవుతూన్న సమస్యకు కూడా ఏదో ఒక పరిష్కార సందేశం అందులో మనకు అలవోకగా దొరికిపోతుంది !

" ఇంటింటా ధ్యానాంధ్రప్రదేశ్ " అన్న పత్రీజీ కల నేరవేర్చే క్రమంలో నావంతు బాధ్యతగా నేను ఆ నెల నాకు క్రొత్తగా పరిచయం అయిన వారికి నాలుగు " ధ్యానాంధ్రప్రదేశ్ " .. సంవత్సరం చందాలను కట్టేస్తున్నాను. కాబట్టి మాస్టర్స్ అందరూ కూడా క్రొత్తగా ధ్యానంలోకి వచ్చే వారికి ఆత్మజ్ణానాన్ని కూడా ఈ పత్రిక రూపంలో అందిస్తూ మళ్ళీ వారు ఇంకా కొందరికి ఈ జ్ణాన విస్తరణ చేసే విధంగా చూస్తే .. " లక్ష ధ్యానాంధ్రప్రదేశ్ లు " అన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కల ఇట్టే నెరవేరుతుంది !

 

- వెల్లంకి లలిత,
విజయవాడ
సెల్ : 0866-2433632

Go to top