" ధ్యాన మూలం ఇదం ఆనందం "

నా పేరు రమణయ్య. వయస్సు 63 సంవత్సరాలు. మాది మెదక్ పట్టణం.

నా గత జీవితమంతా గజిబిజిగా, అస్తవ్యస్తంగా, రాక్షసంగా గడిపాను. 20-8-1999లో "ధ్యానరత్న" శ్రీ నరేందర్ గారు, హైదరాబాద్, ఆనాపానసతి ధ్యానం నేర్పించారు. వారే నా ప్రథమ గురువు. అప్పటినుండి ధ్యానం చేస్తున్నాను.

ఒకసారి 30-10-2000న రామాలయ ప్రాంగణంలో బ్రహ్మర్షి పత్రీజీ గారు, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వ్యవస్థాపకులు, ధ్యాన శిక్షణలో పాల్గొని వారిని శాలువాతో సన్మానించాను. మెదక్‌లో మొదటి ధ్యానిని నేనే. అయినా ఏదో తపన వుండేది. సాధన సాగించాను. ఒక ముక్తి మార్గదర్శి దొరికాడని సంతృప్తి పడ్డాను.

అనేకమార్లు పత్రీజీ గారితో కలిసి కరీంనగర్, జగిత్యాల, ఆర్మూర్, జహీరాబాద్, సిద్ధిపేటలలో ధ్యాన శిక్షణ తరగతిలో పాల్గొన్నాను.

ధ్యానం చేయక పూర్వం చెడు అలవాట్లకు, జూదం, మాంసభక్షణ, కీళ్ళనొప్పులు, అనారోగ్యం, అశాంతి, జుగుప్స, విమర్శలు మొదలగు వాటిని భావించాను. ఆ తరువాత నేను స్వస్వరూపం దర్శించుకున్నాను. ఆ తరువాత "నా వాస్తవానికి నేనే కారణం" అని సత్యం తెలుసుకున్నాను.

కొన్నాళ్ళకు ఆత్మజ్ఞానం, దివ్యచక్షువు ఉత్తేజపరచుకుని మౌనం పాటించాను. అంతేగాక నా గతజన్మలో నేను ఒక ముస్లింగా ధ్యానం ద్వారా తెలుసుకున్నాను. పత్రీజీ ఇవే నా శతకోటి వందనాలు.

డిసెంబర్ 2001న కర్నూలులో జరిగిన ధ్యానయజ్ఞంలో పాల్గొని ధ్యానం అనంతలోకాలలో విహరించాను. అప్పుడు ధ్యానంలో జరిగిన అనుభవం అబ్బురపడ్డాను. ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు పత్రిగారు డాక్టరుగా వచ్చి నా కలును నిమిరారు. దాంతో నా కాలు నయమయింది. అది సికింద్రాబాదు గాంధీ ఆస్పత్రిలో వున్నట్లు అనుభవం వచ్చింది. ధ్యానయజ్ఞం ముగించుకుని ఇంటికి వచ్చిన నాడే 5,00,000 రూపాయల చెక్కు AG ఆఫీసు నుంచి వచ్చింది. నరేంద్ర మాస్టర్‌తో టెలీపతి జరిపాను.

పత్రిగారి సంకల్పం ప్రకారం అన్ని ధ్యానయజ్ఞాలలోనూ మా దంపతులం పాల్గొన్నాం. నా జీవితం ధన్యజీవితంగా మారింది. అలాంటి ఆచార్యునికి ఏం ఇచ్చినా తక్కువే. వారి నిరంతర కృషికి నేను కొంత సమిధగా ఉపయోగపడుతున్నాను. 2004లో ధ్యానంద్రప్రదేశ్, 2008 ధ్యానభారత్, 2012లో ధ్యానజగత్‌గా వర్ధిల్లుతుంది. తరువాత పత్రి, పత్రిగా సత్యయుగం ఆవిర్భవిస్తుంది. ఇది తథ్యం.

కనుక మనమంతా ధ్యానం చేద్దాం. ధన్యులమవుదాం. ఇప్పటికే వేలాదిమంది యోగులుగా, మునులుగా, ఋషి పుంగవులుగా, సిద్ధ పురుషులుగా విరాజిల్లుతున్నారు. రండి ధ్యానం చేస్తూ శ్వాస మీద ధ్యాస ద్వారా పునీతులమవుదాం. ధ్యాన ప్రపంచాన్ని ప్రచారం చేస్తూ చాటి చెబుదాం. "ధ్యాన మూలం ఇదం ఆనందం" అని ప్రపంచానికి తెలియజేస్తూ ధన్యజీవులమవుదాం.

బ్రహ్మర్షి పత్రీజీ గారికీ, వారి సతీమణి స్వర్ణమాలాపత్రి గారికీ, పిరమిడ్ ధ్యానులకూ, మాస్టర్లకూ, సకల ప్రకృతాత్మలకూ నా మనస్సుమాంజలి.

T.V.రమణయ్య,
సీనియర్ పిరమిడ్ మాస్టర్
3-9-93/4AA, కోలిగడ్డ, మెదక్.

Go to top