" పార్వతీ పరమేశ్వరుల నాట్యం "

2004 అక్టోబర్ నెలలో పత్రీజీ విజయనగరం సంగీత కాలేజీలో ధ్యాన తరగతి నిర్వహించినప్పుడు నా తమ్ముడు రామక్రిష్ణ ద్వారా పాంప్లేట్ చదివి ధ్యానంలోకి వచ్చాను.

నాకు హిస్నోఫీలియా, ఆయాసం చిన్నప్పటి నుంచి ఉండేవి. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ అంటే భయం. ధ్యానంలోకి వచ్చిన మూడు నెలలకి అన్ని అనారోగ్యాలు పోయాయి. ఆకాశంలో నక్షత్రాలు, వాటి మధ్య 'ఓం' అక్షరం బంగారు రంగులో కనబడింది. వెంటనే నీలాకాశంలో జీసస్ క్రైస్ట్ కనిపించి రెండు చేతులు చాచి రమ్మని పిలిచారు. అంతలోనే ఆకాశంలో సింహాసనంపై జీసస్ కూర్చున్నారు. వారి ముందు కొందరు స్త్రీ, పురుషులు తెలుపు బట్టలు ధరించి ధ్యానం చేస్తున్నారు. చనిపోయిన మా అమ్మను ఇందులో వుంది చూసుకోమన్నారు. నేను చూడగా వారి మధ్యలో ఆమె ఉండి ధ్యానం చేస్తోంది. మంచుకొండలు, విభూతి కొండలు, బంగారు కొండలు చూసాను.

అక్కడ పార్వతీ పరమేశ్వరులు నాట్యం చేస్తూ ఒకటిగా కలిసిపోయారు. సముద్రం ఒడ్డున ఏడుగురు కన్యలు ఇసుకలో నాట్యం చేస్తున్నారు. క్రమేపీ కనుమరుగయ్యారు. విష్ణుమూర్తి చేతిలో వున్న సుదర్శన చక్రం చాలాసార్లు కనిపించింది.

నేను ధ్యాన ప్రచారం చేయడానికి నిశ్చయించుకున్నాము. నా భర్త హరిశంకర్ గారు విజయనగరంలో క్లాసులో మాంసాహారం మానివేస్తానని వాగ్ధానం చేసిన మేరకు మాంసాహారం మానివేసి ధ్యానం చేస్తున్నారు.

అప్పాజిగారు నిర్వహించిన క్లాసులో 30 నిమిషాలు ధ్యానం చేసి ఆలోచనలు లేని స్థితిలో ఉండగలిగాను.

G.V.పద్మావతి
న్యూ కాలనీ, రాయగడ, ఒరిస్సా.

Go to top