"చాలా గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను"

 

"నా పేరు T.V.రమణ. వయస్సు 57 సంవత్సరాలు. అక్టోబర్ 8, 1999 లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నరేంద్ర ఇన్స్పిరేషన్తో 'స్వాధ్యాయం' చింతన నుండి విడివడి ధ్యాన ప్రక్రియ 'ఆనాపానసతి' అంటే 'శ్వాస మీద ధ్యాస' పద్దతిలో ధ్యానం ప్రారంభించాను. అక్టోబర్ 8, 1999 లో శ్రీ పత్రీజీ దర్శనభాగ్యం కల్గింది. అదేరోజు బతుకమ్మ పండుగ. వారి ఆధ్వర్యంలో రామాయంపేటలో 400 మందికి ధ్యాన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వెంకటేశ్వరాలయంలో, సత్యసాయిబాబా ఆలయంలో, నవోదయ పాఠశాలలో ధ్యాన తరగతులు నిర్వహించబడ్డాయి - ఈ విధంగా మెదక్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ స్థాపనకు అంకురార్పణ జరిగింది. తత్పలితంగా నారాయణ గారు అధ్యక్షులుగా, రమణ కార్యదర్శిగా మరి జయామనోహర్ ఉపాధ్యక్షురాలుగా కమిటీ ఏర్పాటయి దిగ్విజయంగా నాలుగో సంవత్సరంలో అడుగుపెట్టింది."

"మెదక్ పరిసర ప్రాంతాలలోని సుమారు ఎనిమిది పాఠశాలల్లో వందలమంది విధ్యార్ధులకు ధ్యాన శిక్షణ ఇవ్వటం జరిగింది. గజ్వేల్ పిరమిడ్ మాస్టర్ శ్రీ P.నర్సింహులు గారు, హెల్త్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో 2003, జనవరి 1 నుండి చాలా గ్రామాలలో ధ్యానశిక్షణ తరగతులు నిర్వహిస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు."

"అలాగే మెదక్‌కు 15 కిలోమీటర్ల దూరంలో వున్న లక్ష్మీనగర్‌లో ధ్యానశిక్షణ తరగతి నిర్వహించబడింది. ఆ గ్రామం జోగిపేట మాన్యులు శ్రీ బాబుమోహన్ గారి నియోజక వర్గంకావడం, మెదక్ M.L.A ఉమాదేవి గారి గ్రామం కూడా కావడం విశేషం. జోగిపేట తాలుకాను ధ్యానమయం చేయడం 2003 డిసెంబర్ నాటికి మెదక్‌ను 'ధ్యాన మెదక్' చేయడమే నాలక్ష్యం. అని విజయవాడ 'ధ్యాన మహాయజ్ఞం' లో ప్రతిజ్ఞ పూనాను."

"ఎంతోమంది ధ్యానులు తమ మానసిక, శారీరక అనుభవాలను వెల్లడించారు.


T.V రమణ
మెదక్

Go to top