" ధ్యానం వలన నా చదువు ఎంతో ఇంప్రూవ్ అయ్యింది. "

 

"నా పేరు A.S.S.N. మూర్తి." మల్కాపుర్ కూరగాయల మార్కెట్ వద్ద వుంటాను. "నాకు ఈ ధ్యానం 5 నెలల క్రితం తెలిసింది. నేను C.B.I.T. లో Civil Engineering చేస్తున్నాను." "ఈ ధ్యానం నాకు మొదటిగా మా కోలీగ్ ద్వారా తెలిసింది. అప్పటి నుండి నాకు ధ్యానం చెయ్యాలని ఆసక్తి కలిగింది. నా అనుభవమేమిటంటే మొదట నాకు చదువు సరిగా వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి నన్ను 'మొద్దు' అని పిలిచేవాళ్ళు, ఈ విధంగా చిన్నప్పటి నుంచి చదువు విషయంలో ఎన్నో బాధలు, అవమానాలు పడి చివరికి ఇంటర్ పూర్తిచేసాను. అంతవరకు నాకు ఎప్పుడూ థర్డ్ క్లాసే వచ్చేది. ఇప్పుడు నా పరిస్థితి నాకే అర్ధం కావడం లేదు. ఈ ధ్యానం మొదలు పెట్టాక నాలో పెరిగిన అంశాలు" -

"క్లాసులో ఏకాగ్రతతో అన్నీ గ్రహించగలుగుతున్నాను. నా మీద నాకు నమ్మకం పెరిగింది. ఈ రెండు అంశాలు నాలో చైతన్యం కలుగజేసాయి. ఇప్పుడు నేను చాలామందికి ట్యూషన్ చెబుతున్నాను. మా ఫ్రెండ్స్‌కి నేనే చెప్పగలిగే అంత నైపుణ్యం నాకు వచ్చింది. నన్ను చూసిన నా తోటి విధ్యార్ధులు కూడా నాతో పాటు మెడిటేషన్ చేస్తున్నారు. ఇది నాకు ఎంతో ఆనందంగా ఉంది. నా ధ్యానం ఇలాగే కొనసాగాలని తలుస్తూ ముగిస్తున్నాను."

 

A.S.S.N. మూర్తి

Go to top