" లక్షలమంది యువకుల ప్రేమను పొందే బుద్ధుడు పత్రీజీ "

 

నా పేరు నరేందర్ ముదల్‌కర్, హైదరాబాద్ నివాసిని.

పత్రిగారి గురించి నాకు 1993 సం||లో గాయత్రి అమ్మవారు "నువ్వు ఆయన గురించే జన్మను తీసుకున్నావు" అని చెప్పడం చాలా గొప్పవిషయం!

1997 సం|| జూన్ 16వ తేదీన మొట్టమొదటిసారి పత్రీజీని కలిసాను. ఆయనను కలవడం ఒక మహాఅద్భుతం నా జీవితంలో! 1991 సం|| నుండి ఆధ్యాత్మిక రంగంలో దిగాను.

అంతకుముందు ఎన్నో ఆధ్యాత్మిక పుస్తకాలు చదివాను. ఎంతోమంది గురువులను కలిశాను కానీ ఏ గురువు నన్ను తృప్తి పరచలేదు. ఏదో ఒక ‘వెలితి’ అనిపించేది. అధ్యాత్మిక నిండుతనం నేను చూసింది ఆయన కళ్ళలో, మాటల్లో, చేతల్లో మరి విషయంలో, అలాంటి నిండుతనంతో ఉన్న ఆ మహానీయుడిని గురువుగా ఇవ్వడం విశ్వం నాకిచ్చిన ఓ మహత్తరమైన బహుమతి! అందుకే ఆ విశ్వానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ముందు నుంచీ నేను బుద్ధజీవిని. ఎవరిని గురువుగా ఒప్పుకొలేదు. అలాంటి నన్ను దగ్గరకు చేర్చి అకట్టుకున్న యుగపురుషుడు పత్రీజీ.

నా జాతకం చూసి బ్రాహ్మణుడు "నీ జాతకం ప్రకారంగా నీకు ఏమిలేదు, అంధకారమైన జీవితం" అని చెప్పారు, చెబుతూ ఆయనే మళ్ళీ "ఆధ్యాత్మిక శక్తితో నీ యొక్క జీవితాన్ని మార్చుకునే అవకాశం వుంది" అని చెప్పారు. పత్రీజీని కలిసేవరకు నా యొక్క జీవితం అంధకారమే. పత్రీజీని కలిశాక అన్ని భోగాలే!

పత్రీజీని కలిసాక ఏం జరిగింది??

అంధకారం నుంచి ప్రకాశం వైపుకు వచ్చాను. చీకటి నుంచి వెలుతురు వైపుకు వచ్చాను. బానిసత్వం నుంచి యజమాని వైపుకు వచ్చాను. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకు వచ్చాను. మాటలు రాని వాడిని ఒక వక్తను అయ్యాను. ఏ జ్ఞానం లేనివాడిని ఒక శాస్త్రవేత్తగా అయ్యాను. లక్షలమంది జీవితాలను మార్చేశక్తిని కలిగించుకున్నాను.

సరియైన జీవన విధానం, సరియైన మాట్లాడే విధానం, సరియైన ఆలోచనా విధానం, సరియైన అధ్యాత్మిక విధానం .. right way of life, right way of thinking, right way of worship .. ఇవన్నీ నాకు పత్రిగారి వల్ల లభించాయి .. దటీజ్ పత్రీజీ!

ఇలాంటి మహనీయుడి ప్రపంచంలో నేను వుండటం నా యొక్క మహాభాగ్యం. నామమాత్రంగా బ్రతికే నన్ను ఒక బుద్ధుడిగా తీర్చిదిద్దారు పత్రీజీ.

అర్జునుడు శ్రీ కృష్ణుణ్ణి కలిశాక ఎలాగయితే మోహం వెళ్ళిపోయిందో .. నష్టో మోహ స్మృతిర్ లబ్ధ్వా అలాగే పత్రిగారిని కలిశాక నా మోహం కూడా నశించింది.

శ్రీవర్వ్‌దస్‌వా మాయశ్య మారోగ్య మావిధాచ్చోగ్ మానః మయ్యలే!

ధ్యానం ధనం పశుం బహు పుత్రులాభం శథ సంవత్సర దీర్ఘమాయుహా|| (శ్రీస్తుక్తం)

ఆత్మజ్ఞానమనే అష్టైశ్వర్యాలను నేను పత్రీజీ వల్ల పొందాను. ఇలా ఎవరిని వారే ఉద్ధరించుకునే అవకాశం వుందని అందరికీ తెలిపిన మహానీయుడు నా పత్రీజీ.

1998-2000సం||లో నేను మెదక్ జిల్లాల్లో ధ్యానప్రచారం చేసేవాడిని. రెండు సం|| పాటు నాయొక్క బైక్ పైన ప్రతి ఆదివారం ధ్యాన ప్రచారానికి వెళ్ళేవాడిని. అప్పుడు మెదక్‌లో జరిగిన సంఘటన మీతో పంచుకుంటాను. ఒక రోజు గ్రౌండ్‌లో సాయంత్రం 6 గం|| నుండి రాత్రి 9 గం||ల వరకు ధ్యానశిక్షణ యిస్తున్నాను. అదే సమయంలో ఊరంతా వర్షం పడుతోంది కానీ ఆ గ్రౌండ్‌లో ఒక్క నీటిచుక్క కూడా పడలేదు! ఆ అనుభవం చూసి చాలామంది ధ్యానులుగా మారిపోయారు! నిజానికి వారికి పత్రీజీ అంటే తెలియదు. చేసింది ఆయనే కానీ .. నిమిత్తమాత్రంగా వున్న నాకు ఎంతో కీర్తి వచ్చింది. దటీజ్ పత్రీజీ! 2004 సం||లో మెదక్‌లో 10 లక్షల రూపాయలు వెచ్చింది గొప్ప పిరమిడ్ నిర్మించబడింది.

జోగీపేట పట్టణంలో ధ్యానశిక్షణ తరగతులు చేసి నేను నాయొక్క తమ్ముడు దేవేందర్ సుజుకి బైక్ మీద వస్తూంటే ముందుచక్రం గాలి పోయింది.అది రాత్రి 11గం||ల సమయం. హైదరాబాద్ అక్కడి నుండి 80 కి.మీ. చుట్టుప్రక్కల ఎవ్వరూ లేరు, చిమ్మచీకటి, హోరున వర్షం పడుతోంది. మెల్లగా అలానే బయలుదేరాం. కొద్దిదూరంలో వెళ్ళి చూసెసరికి ఆ చక్రం గాలితో నిండిపొయింది. అలాగే మేము హైదరాబాద్ వరకూ వచ్చేశాం, రాత్రి 2గం||లకు బండి ఇంట్లో పార్కు చేసి పడుకున్నాము. పొద్దున్నే లేచేసరికి మళ్ళీ ఆ చక్రంలో గాలి లేదు. పంక్చర్ షాప్‌కి వెళ్ళి చూపిస్తే ట్యూబ్ మొత్తం చిరిగిపోయి వుంది. ఆ చక్రంలోకి గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా చుస్తే ఇది నా కార్యం కాదు, ఇది ఖచ్చితంగా పత్రీజీ ఘనకార్యమే!

సొంత పిల్లలకంటే ఎక్కువ చుసూకుంటారు పత్రీజీ మనల్ని. నా జీవితంలో నా తండ్రి దగ్గర పొందలేని ప్రేమ, అప్యాయతను పత్రిజీ దగ్గర పొందాను. ఇలాంటి లక్షలమంది యువకుల ప్రేమను పొందే బుద్ధుడు "పత్రీజీ".

2004 సం||అగస్ట్ 26 వ తేదీన నాకు కూతురు పుట్టింది. పేరు "సంస్కృతి", అయితే పుట్టినప్పుడు ఆమెకు గొంతు లేదు. ఎలాంటి శబ్దము లేదు, ఏడుస్తే కూడా వాయిస్ లేదు, ఆ రోజు రాత్రి అంతా ధ్యానంలో కూర్చుని పత్రిగారిని అడిగాను "మూగపాపను గిఫ్ట్‌గా ఇచ్చారు సార్, లక్షలమందికి ధ్యానం గొంతుచించుకొని చెప్తు ఉంటే నాకు మీరు చాలా పెద్ద బహుమతిని ఇచ్చారు” అని. వెంటనే ఆకాశమంత పెద్దరూపంలో పత్రిగారు కనిపించారు. “నేనున్నాగా నీకెందుకు? ఆ పాప నీ పాప కాదు, నా పాప. ఆమె ఎవరో కాదు సాక్షాత్తూ గాయత్రి అమ్మవారు నువ్వు చేసిన 5 లక్షల జపాలకు ఆనందించి నీ ఇంట్లో కూతురుగా పుట్టింది. అమెకు సరిగ్గా మూడు రోజులలో గొంతు వస్తుంది" అని చెప్పారు. ఖచ్చితంగా అలాగే జరిగింది! పాపకు సరిగ్గా మూడురోజులకు గొంతు నుంచి శబ్దం రావడం మొదలై, ఆమె ఏడుస్తే వాడ వాడంతా వినిపించింది. ఇప్పుడు అమె సంగీతం ఎంతో బాగా పాడగలదు.

ఇలాంటి అద్భుతాలు చేసే మహనీయుడు నా పత్రిగారు .. అయనకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను? .. నా తుది శ్వాసవరకు నిరంతరం ధ్యానప్రచారం చేయడం తప్ప .. దటీజ్ పత్రీజీ!!

 

నరేందర్ ముదల్ కర్
హైదరాబాద్
సెల్ : +91 9849514574

Go to top