" పత్రీజీ మా అందరికీ ఫ్రెండ్ "

నా పేరు కృష్ణప్రియ.

మాది ఆదోని. నేను రాయచూర్‌లోని ’నవోదయ మెడికల్ కాలేజీ"లో MBBS రెండవ సంవత్సరం చదువుతున్నాను.

నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం .. 2007 సం|| సెప్టెంబర్‌లో పత్రీజీని కలవడం! ఆరోజు ఆయన నన్ను "క్యాబాత్ హై?" అని అడిగారు.

అప్పటికి నేను మాంసాహారిని, ఎవ్వరు చెప్పినా కూడా మాంసాహారం మానివేయని నేను .. సార్‌ని కలిసినపుడు ఆయన నా వైపు చూసిన ఒకే ఒక్క చూపుతో .. వేసిన ఒకే ఒక్క ప్రశ్నతో మాంసాహారం పూర్తిగా మానివేసి శుద్ధ శాకాహారినై పోయాను

ఇలా ఎందరినో ఒక్క చూపుతోనే మార్చివేసి వాళ్ళ ఆత్మోన్నతికి తోడ్పడే గురువు ఒక్క పత్రీజీ మాత్రమే.

ఏ ఆధ్యాత్మిక పుస్తకంలోనైనా .. ఒక పరమాత్మ అంటే ఎలా ఉంటారు?.. ఆ పరమాత్మలోని గుణాలు ఎలా ఉంటాయి?.. అనేవి అన్నీ మనం పత్రీజీ తో పోల్చుకోవచ్చు. దటీజ్ పత్రీజీ!

ఆయన ఎప్పుడు మనకు బోధించేది ఒకటే "నిన్ను నువ్వు ఉద్ధరించుకో!" అని. ఒక శిష్యుడు తనకు తాను స్వతంత్రంగా ఎదగాలి అన్నదే ఆయన ఆకాంక్ష.

ఆయన సాంగత్యంలో ఎంతో నేర్చుకోవచ్చు. ఒక పర్‌ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్‌కు ఆయన నిలువెత్తు ప్రతిరూపం. అసలు ఆయన Reflect చేస్తారు.

ఎన్నోసార్లు సార్‌తో కలిసి క్లాస్‌లకు, పిరమిడ్ ప్రారంభోత్సవాలకు వెళ్ళడం, మరి సార్, పత్రీ మేడమ్‌లతో కలిసి వాళ్ళింట్లో గడపడం జరిగినప్పుడు నేను గమనించిందేమిటంటే .. సార్ ఒక్కసారి కూడా .. ఒక్కక్షణం వృధాచేసింది కానీ.. ఒక్క వృధా మాట మాట్లాడింది కానీ నేను చూడలేదు. ఇలాంటి శిక్షణ నిజంగా మాలాంటి యువతకు చాలా చాలా అవసరం. దటీజ్ పత్రీజీ!

అన్నీ తెలిసి కూడా .. మా పైమా వాళ్ళతో కలిసి ఒక ఫ్రెండ్ లాగా ఎంతో జోవియల్‌గా ఎంజాయ్ చేస్తూ.. తనకేమీ తెలియనట్లు నటిస్తూ.. మళ్ళీ అంతలోనే ఏ వ్యక్తిత్వ వికాన నిపుణులు కూడా ఇవ్వలేనటువంటి అత్యున్నతమైన ఆత్మజ్ఞాన శిక్షణను మాకు అందచేస్తుండే అద్భుతమైన కళాకారులు పత్రీజీ.

ఇలా ఆధ్యాత్మికతనూ, ఆత్మజ్ఞానాన్నీ సులభంగా.. జీవితంలో అదొక భాగంగా అందరికీ అర్థమయ్యేలా చేసింది ఒక్క పత్రీజీ మాత్రమే. దటీజ్ పత్రీజీ.

"నన్ను మించిపోవడమే నాకు మీరిచ్చే అసలైన గురుదక్షిణ" అని ఏ గురువు చెప్తారు చెప్పండి? అలాంటి గురువును ఇంతచిన్న వయస్సులోనే పొందిన మేము ఎంతో అదృష్టవంతులం.

అందరిని తన వాక్కుతో అమితంగా ప్రోత్సహిస్తూ ఎన్నో లక్షల పిరమిడ్ మాస్టర్లను తయారుచేసారు పత్రీజీ. ఇలాంటి ‘వండర్‌ఫుల్ గురువుకు మనం ఇచ్చే ఏకైక గురుదక్షిణ .. ఆయనని విస్తారంగా వ్యాపింపచేయడమే.

అతిత్వరగా మనం "ధ్యానజగత్" మరి "పిరమిడ్ జగత్" ను సాధించేద్దాం!!


- కృష్ణప్రియ,
ఆదోని

Go to top