" ప్రత్యేకమైన ‘మిరాకిల్స్’ అనేవి ఏవీ చెయ్యకుండా జరిగిన ప్రతీదీ ‘మిరాకిలే’..అనిపించేలా చేయడమే అల్టిమేట్ గురువు లక్షణం దటీజ్ పత్రీజీ "


"సిద్ధసమాధి యోగ..", "సమాధి మెడిటేషన్..", "సోహం మెడిటేషన్..", "కుండలినీ మెడిటేషన్..", "ఓషో డైనమిక్..","అష్టాంగ యోగ..", "బ్రహ్మకుమారీస్..", "క్రియాయోగ..","విపస్సన.."

ఎన్నెన్ని చూశానో.. ఎంతో తపించానో.. అయిన "ఏదో" కావాలి.. అది ఏమిటో తెలీదు..

ఒక్కొక్క చోటికి వెళ్ళి నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆ పద్ధతులన్నీ అభ్యసించాక పాటించాక "అదేదో.. ఇది మాత్రం కాదు" అనిపించేది!

అలా.. ఒక గూటి నుంచి ఇంకో గూటికి నా సత్యాన్వేషణా ప్రస్థానం కొనసాగింది.

నా సత్యాన్వేషణా ప్రస్థానం కొనసాగింది.

"వివేకానందుడు" అంటే చాలా ఇష్టం.. ఆయన కూడా ఇలాగే తిరిగాడు కదా!

"నేనెవరు?", "ఎక్కడి నుంచి వచ్చాను?", "ఏం చేస్తున్నాను?", "జంతువులకూ- మనకూ తేడా ఏంటి?", "మనం జంతువులకన్నా భిన్నంగా ఏం చేయాలి?, "మూడోనేత్రం ఏంటి?", "నా లోకి నేను, చూసుకోవడం ఎలా?", "సూక్ష్మశరీరయానం, నిజంగా వుందా?".

ఎక్కడా జవాబులు దొరకని ఈ ప్రశ్నలతో లలితతోరణంలో జరిగినపత్రీజీ మీటింగ్‌కి వెళ్ళాను!
ఆయన్ను నేను కలవలేదు, మాట్లడలేదు కానీ ఆ రోజు మీటింగ్‌లో పత్రీజీ అందించిన సందేశం
మొత్తం.. నా ప్రశ్నలకు సమాధానమే!

"కేవలం.. నా ఒక్కదానికోసమే ఆ ఉపన్యాసం చెబుతున్నారా?!" అనిపించింది నాకు! ఇక అడగడానికి ప్రశ్నలే లేకుండా అయ్యాయి ఎంతో క్లారిటీ దొరకింది సంతృప్తి పొంగిపొర్లింది "మూడోకన్నువాడు శివుడు ఒక్కడే కాదు.. అందరికీ మూడోకన్నువుంది.. మేడమ్!"

రెండోసారి పత్రీజీని చూసినప్పుడు ఆయన చెప్పిన ఈ మాట ఎన్ని జన్మలెత్తినా మరిచిపోలేనంతగా నా గుండెల్లో నాటుకుపోయింది!

కారణం తెలుసా? ఆ రోజు "పత్రీజీని అడిగి ‘మూడోకన్ను’ గురించి తెలుసుకోవాలి" అనిపించింది నాకు.. అడగకుండానే అందుకున్నాను!

"నేను గొప్ప", "గురువే దైవం", "నన్ను శరణు పొందు", "అన్నీ నేనే చూసుకుంటా", అనేది ఇక్కడ లేదు!

"నీ దీపం నువ్వే వెలిగించుకో!", "నీ కోసం నేను ఏమి చెయ్యను!, ఇంట్లో ఏదో ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, చెప్పుకోవడానికి వెళ్తే.., ఎవరితోనో ఈ మాటలు అంటున్నారు ఆయన.. సమాధానం ఎవరికి? ఇతర ఆశ్రమాల్లో చాలా ఆచారాలు.. కట్టుబాట్లు! ఇక్కడ.. "ధ్యానం చెయ్యి "అంతే! తిన్నాకైనా చెయ్యి తినకుండానైనా చెయ్యి ఎక్కడైనా చెయ్యి ఎప్పుడైనా చెయ్యి
రిస్ట్రిక్షన్స్ అనేవి లేనే లేవు "శ్వాస మీద ధ్యాస" ఇదొక్కటే.. ఇంతకన్నా సులభమైన దారి ఇంతకుముందు ఎవ్వరూ చూపించలేదు!

నా భర్త గోపాలరెడ్డి గారు.. అంతకముందు నేను నమ్మిన అనేక గురూజీల పద్ధతులను ఆయన గారితో పాటింపజేయాలని శతప్రయత్నాలు చేశాను నా పప్పులు అస్సలు ఉడకలేదు!

కానీ.. పత్రీజీ మార్గం గురించి చెప్పాను వెంటనే ఆయన ఈ మార్గంలోకి వచ్చారు! ఎందుకంటారు?

మా పెద్దబ్బాయి సుధాకర్‌రెడ్డి అమెరికాలో ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్.. మన వెబ్‌సైట్ చూడమనీ,
ధ్యానం చెయ్యమనీ చెప్పా.. తనూ, నా కోడాలూ.. పత్రీజీ దారిలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి!

చిన్నబ్బాయి మధుకర్‌రెడ్డి.. చదువు మీద ధ్యాస లేని కుర్రాడు.. పత్రీజీ మార్గంలోకి ఆ అబ్బాయిని మార్చకోగలిగాను!


దుబాయ్‌లో మీడియా కన్సెల్టెన్సీ సొంతంగా పెట్టి 210 భాషల్లో ట్రాన్‌సాక్షన్ చెయ్యగలుగుతున్నాడు!

అతడు కూడా "పత్రీజీ ‘వే’ మాత్రమే ఫైనల్ ‘వే’" అని నమ్మేశాడు!

ప్రత్యేకమైన ‘మిరాకిల్స్’ అనేవి ఏవీ చెయ్యకుండా జరిగిన ప్రతీదీ ‘మిరాకిలే’.. అనిపించేలా చేయడమే అల్టిమేట్ గురువు లక్షణం అండ్.. దటీజ్ పత్రీజీ!

 

సుందరి గోపాల రెడ్డి
హైదరాబాద్
ఫోన్ - +91 40 27532066

Go to top