" అంతా మంచే జరుగుతోంది "

 

" నా పేరు K. రుక్మిణీబాయి; వయస్సు 57 సంవత్సరాలు." "జూన్ 16. 2002 రోజున ఉదయం 6.00 గంటల ప్రాంతంలో నన్ను, నా భర్త K. రాంకిషన్ రావును శ్రీ T.V.రమణ గారి శ్రీమతి శ్రీ లలిత గారు ధ్యానంలో కూర్చోబెట్టారు. వారి 'శ్వాస మీద ధ్యాస' ప్రక్రియ ద్వారా నేను, నా భర్త డీప్ మెడిటేషన్‌‍లోకి వెళ్ళిపోయాం. ఆ సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉంది. అయినా ధ్యానంలో కూర్చోబెట్టి, 'రోజూ 30 నిమిషాలు చేయండి మంచి ఫలితం వుంటుంది' అని చెప్పారు. అదేవిధంగా రోజూ రెండు పూటలా చేశాం. అయితే ఒకరోజు ధ్యానంలో తెల్ల డ్రెస్ గల గడ్డం, బోడిగుండు ముసలాయిన నన్ను మూడుసార్లు తట్టిలేపి 'ఏమీ కాదు అంతా మంచే జరుగుతుంది. అని ధ్యానంలో ధ్యానం చేయించారు. అప్పుడు మా ప్రక్కనే వుంటున్న మాస్టరును అడిగాను. వారు పత్రీజీ ఫోటో చూపించారు; ఇలాగే ఉన్నారు అని నేను చెప్పినప్పుడు, ధ్యానంలో సూక్ష్మశరీరం విడుదలయినప్పుడు మాస్టర్లు వస్తారు, వారు హీలింగ్ చేస్తారని చెప్పారు."

"అప్పట్నుంచి మావారు అటూ ఇటూ కర్ర సహాయంతో తిరగడం, హుషారుగా ఉండటం గమనించాను." "మా వారు కొంచెం కొంచెం కోలుకుంటున్నారు; ఒకరోజు మధ్యాహ్నం ఆయనకు ధ్యానంలో తన ప్రక్కన 10 మంది ఉన్నట్లు, వారు మా ఆయనకు ఏదో చెబుతున్నట్లు ఆయన వింటున్నట్లు అనుభవం వచ్చింది. అదే నా టర్నింగ్ పాయింట్ అయ్యింది. దాంతో విజయవాడా ధ్యానమహాయజ్ఞంకు హాజరయ్యాం. ధ్యానం గొప్పతనం బాగ తెలిసింది. అందరూ ధ్యానం చెయ్యండి - అనాపానాసతి ధ్యానాన్ని అందరి చేతా చేయించండి."

 

K. రుక్మిణీబాయి
మెదక్

Go to top