"లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ త్రూ మెడిటేషన్"

 

నేను 'ధ్యాని' కాక పూర్వం విపరీతమైన కోర్కెలతో, "ఏవిధంగా అయినా, అడ్డదారిలో అయినా సరే డబ్బు సంపాదించి, సంఘంలో గొప్పగా చలామణి అవ్వాలి." అనుకునేవాడిని. ధ్యానం చేసేవాళ్ళను విమర్శించేవాడిని.

ఒకరోజు మేడమ్‌వాళ్ళు "కురు ముద్దాలి పిచ్చమ్మ ఆశ్రమానికి వెళ్దాం" అంటే "70 రూపాయిలు ఖర్చు అవుతుంది." అని హేళన చేశాను. దానికివాళ్ళు "మీ ఖర్చుకు బదులు కొన్ని లక్షల విలువ చేసే ఆశీస్సులు ఇప్పిస్తాం" అన్నారు.

ఆ ఆశ్రమంలో మర్రిచెట్టుక్రింద ధ్యానం చేస్తూంటే నా శరీరం అంతా కాలిపోయినట్లు అనిపించింది.ఆ రోజు నుండి నాకు ధ్యానం పై ఆసక్తి కలిగి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ధ్యానం చేసిన తరువాత నా మానసిక పరిస్థితి పూర్తిగా మారింది. బ్రతకడానికీ, కనీస అవసరాలకూ మాత్రమే డబ్బు అవసరమనీ, డబ్బుకోసమే మనం బ్రతకటం కాదని తెలుసుకున్నాను.

తల్లిగర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు శ్వాసతో వస్తాం. శ్వాస ఆగిపోతే 'చనిపోయాడు' అంటారు. అప్పుడు మనం సంపాదించిన ధనం, గౌరవం, పలుకుబడీ ఏదీ మన వెంటరాదు. కనుక, శ్వాస ఉండగానే మనలను మనం ఉద్దరించుకోవాలి. ధ్యానం చేసి మనం ఏమిటో మనం తెలుసుకోగలగాలి.

బాహ్య జీవిత విలువల కన్నా, బాహ్యప్రపంచం కన్నా అంతర్ జీవితం, ఆత్మజ్ఞానమే మిన్న అని నేను ధ్యానం చేయడం ద్వారా గ్రహించాను.

ప్రస్తుతం ఆనందంగా జీవిస్తున్నాను. ఈ ఆనందాన్ని ఏ స్వప్రయోజనమూ లేకుండా నాకు అందించిన పత్రిసార్‌కు నా వంతుగా నేను చేయగలిగింది, నా చివరి శ్వాస ఉన్నంతవరకూ ధ్యాన ప్రచారం చేయటం, అందరికీ ఆనందాన్ని అందించడం.

ధ్యానాభినందాలతో,

G.సాంబశివరావు
గుడివాడ

Go to top