"ధ్యానం వల్ల మానసిక ప్రశాంతతని పొందగలిగాను"

 

"నా పేరు K. సుహేల. వయస్సు 50 సంవత్సరాలు. నేను వరంగల్ జిల్లా హన్మకొండ నివాసిని. "నాకు బ్రహ్మంగారి మఠానికి చెందిన మేడం పద్మగారి ద్వారా మరి కర్నూలుకు చెందిన మనోహర్ మాస్టర్ గారి ద్వారా ఈ ధ్యాన పరిచయం జరిగింది."

"ఫిబ్రవరి 2001లో పత్రి గారిని మొదటిసారిగా కలవటం జరిగింది. ఈ ధ్యానం వల్ల మానసిక ప్రశాంతతని పొందగలిగాను." "నేను ఇప్పటివరకు 'ఒక యోగి ఆత్మ కథ', ’ధ్యానం శరణం గచ్ఛామి’ 'తులసీదళం', 'వశిష్టామృతం', 'ధ్యానం జిడ్డుకృష్ణమూర్తి', 'సత్యార్ధ ప్రకాశం', 'అతీషా ప్రజ్ఞావేదం' అనే పుస్తకాలు చదివాను.

"వీటిలో నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం 'ధ్యానం శరణం గచ్ఛామి' ". "క్రొత్తవాళ్ళకు 'ఆనాపానసతి' పుస్తకాలు ఇవ్వడం, స్వాధ్యాయం, సామూహికంగా ధ్యానం చెయ్యడం ద్వారా ధ్యాన ప్రచారంలో పాల్గొంటున్నాను."

 

K.సుహేల
హన్మకొండ
వరంగల్

Go to top