" రెండు సంవత్సరాల నుండి ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాను "

 

"నా పేరు S. వెంకటరెడ్డి. వయస్సు 38 సంవత్సరాలు. నేను ఖమ్మం జిల్లా, మధిర నివాసిని." "నేను రెండు సంవత్సరాల నుండి ఈ 'ఆనాపానసతి' ధ్యానం చేస్తున్నాను." "మధిరలో జ్ఞాన ప్రశిక్షణ తరగతులలో మరి శ్రీశైలం 2000 - ట్రెక్కింగ్‌లో పత్రి గారిని మొదటిసారిగా కలవటం జరిగింది. "ఈ ధ్యానం వలన నాకు ఏకాగ్రత పెరిగింది. మందులు వాడాల్సిన అవసరం లేకుండాపోయింది."

"నేను ఇప్పటివరకు తులసీదళం, 'ఒక యోగి ఆత్మకథ', 'నక్షత్ర మిత్రులు', 'మరణంలేనిమీరు', 'జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్' పుస్తకాలు చదివాను. " "వీటిలో బ్రహ్మర్షి పత్రీజీ గారు రచించిన "తులసీదళం" అనే పుస్తకం నన్ను బాగా ఆకట్టుకుంది." "మాకు మధిరలో భరత్ కాలేజ్ & స్కూల్ ఉంది. మావిద్యార్ధులకు వారి ద్వారా వారి తల్లిదండ్రులకు ఈ 'ఆనాపానసతి' ధ్యానాన్ని గురించి చెప్పటం ద్వారా ధ్యాన ప్రచారం కొనసాగిస్తున్నాం."

 

S.వెంకటరెడ్డి
మధీర, ఖమ్మం

Go to top