" పోయింది, దొరికింది "

 

నా పేరు సుబ్బారావు. తిరుపతి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ.

నేను ఎప్పుడూ ఏ ట్రెక్కింగ్‌కు వెళ్ళలేదు. పది అడుగులు మించి నడిచినది లేదు. అంతా ద్విచక్ర వాహనంలో ప్రయాణం. అలాంటివాణ్ణి ఈ ధ్యానయాత్రలో రోజుకు ఐదు కి.మీ. మరి ఎనిమిది కి.మీ. గురువు గారితో కూడా మహావతార్ బాబా గుహకు నడిచి వెళ్ళానంటే, నిజంగా గురువుగారి దివ్యశక్తితో వెళ్ళగలిగాను!

ధ్యానం చేస్తుండగా ఉదయించే సూర్యునివలె శివుడు కొండపైకి వస్తున్నాడు మరి బంగారు పిరమిడ్లు కనిపించాయి. బదరీనాథ్ దేవాలయంలో ధ్యానం చేస్తూండగా, సింహం మీద దుర్గాదేవి శూలం పట్టుకొని కూర్చొని కనిపించింది.

ప్రతిరోజూ గురువు గారిని చూడడం, వారు "సుబ్రావ్! సుబ్రావ్!" అంటూ అమితానందంతో నన్ను పిలవడం వారి కంటిద్వారా ఎనర్జీని పంపడం నడువడానికి నాకెంతో ఉత్సాహాన్ని కలిగించింది!

మరో విశేషం :-

’గంగారియా" నుంచి "గోవిందఘాట్"కు అతికష్టం మీద గుఱ్ఱం మీద 14 కి.మీ. వచ్చి చేరాను. ఇక్కడ టీ అంగడిలో టీ త్రాగాను. వారికి ధ్యానం గురించి చెప్పాను. అక్కడ నా పర్సు పడిపోయింది. 1 1/2కి.మీ. దూరంలోని బస్టాండు కి వెళ్ళిన తర్వాత పర్సు చూసుకున్నాను. కేశవరాజు గారితో ఈ విషయం చెప్పాను.

ఇంతలో షాపు గుమాస్తా, నన్ను ప్రక్కకు పిలిచి "చాయ్ పీయేగా, తుమ్‌‌కా ఐడి కార్డ్ బతావో" అన్నారు. వెంటనే నేను "మెరా పర్సు మే రాఘవేంద్రస్వామి ఫోటో, పాన్‌కార్డ్, రిటర్న్ టికెట్ రూ. 400 నుంచి 500 రూ||లు హై" అన్నాను. నా పర్సు నాకిచ్చారు, ఎంతో ఆనందమయింది!

చిత్తశుద్ధితో దృఢమైన సంకల్పం, విశ్వాసంతో ధ్యానం చేసామంటే, మనవెంట గురువు గారు మాస్టర్స్ తప్పక మనలను కాపాడుతూంటారు!!

 

సుబ్బారావు
తిరుపతి

Go to top