" పిరమిడాంధ్రప్రదేశ్ "

 

నా పేరు B.V. రెడ్డి.

నేను నవంబర్ 1990 సం||లో ఓ మిత్రుని ద్వారా శ్రీ పత్రిగారిని కలిసాను. అంతకు మునుపే ధ్యానం అంటే కొద్దో గొప్పో నమ్మకం వుండేది. అంటే థియరిటికల్‌గా మాత్రమే కొంత తెలుసుకున్నాను. అయితే, అనుభవపూర్వకంగా, ప్రాక్టికల్‌గా, నవంబర్ 1990 సం|| నుంచి మాత్రమే నా ధ్యానజీవితం మొదలయింది. అయితే డిసెంబరు 1990 సం|| నాటికే కొన్ని అనుభవాలు కలిగాయి.

30 డిసెంబర్ 1990 న ఓ Eternal Master ను ధ్యానంలో చూడటం, వారితో సంభాషించడం జరిగింది. ఆ మాస్టర్ పూర్వజన్మల సంబంధాల గురించీ, ప్రస్తుత జన్మలో నాలో కొన్ని వీక్ పాయింట్స్ గురించీ చెప్తూ, "నీకు ఇదే సరైన మార్గం" అని చెప్పి వెళ్ళారు. ఈ సంభాషణ మొత్తం 45 నిమిషాలు జరిగింది. ఈ అనుభవం ద్వారా ధ్యానంలో ఏమైనా సాధించవచ్చునని నాకు పూర్తి నమ్మకం కుదిరింది.

ఈ నమ్మకం ద్వారానే నేను ‘teleportation' అనే క్రియ వల్ల ఎక్కడో వేరే చోటున పెట్టిన సెంటును, అక్కడికి దూరంగా ధ్యానంలో కూర్చుని నా చేతిలోకి రప్పించాను! ఇది నా మిత్రులందరూ చూసారు! ఇది నేను కొద్ది రోజుల ధ్యాన సాధన ద్వారానే సాధించాను! ‘నాలో ఇంత శక్తి వుంది’ అని నా చర్య ద్వారా నాకే నిరూపితమయింది.

ధ్యానంలో ముందుకు పోతున్నకొద్దీ, అలాగే పత్రి గారి సాంగత్యం, పుస్తక జ్ఞానం పెరుగుతున్న కొద్దీ, అందరికీ అందుబాటులో వుండే విధంగా ఓ ‘ధ్యాన మందిరం’ నిర్మించాలన్న ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఒక రోజు పత్రిగారు ‘పిరమిడ్స్’ గురించి వాటి యొక్క శక్తి గురించి వివరించడం, మరి "ధ్యానం చేసేవారికి ఇది చాలా ఉపయోగకారి", అని చెప్పడం జరిగింది.

వారి సలహా మేరకు, మరి ఇతరుల సహకారంతో నేను 40/40 అడుగుల సైజులో 1991 సం||లో ‘ధ్యాన పిరమిడ్’ ను నిర్మించాను. దానికి "బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం" అని నామకరణం చేయడం జరిగింది. పిరమిడ్ కట్టడం లోపల ధ్యానం చేయడానికీ, బయట చేయడానికీ చాలా తేడా కనబడుతుంది. పిరమిడ్‌లో ధ్యానం చేయడం వల్ల శరీరంలో సెల్యులర్ సిస్టమ్ ఎక్కువగా (కాస్మిక్ ఎనర్జీ) ‘విశ్వశక్తి’ ని తీసుకొని శక్తివంతంగా తయారయి అన్ని రోగాలనూ పోగొడుతుంది. అంతేకాకుండా భౌతిక కాయేతర యాత్రలు out of body experiences కూడా చాలా వస్తాయి. నేను నా High B.P. ని మందులు వాడకనే ధ్యానం ద్వారానే తగ్గించుకున్నాను.

 

B.V. రెడ్డి
కర్నూలు

Go to top