" నీ థాట్ నాకు టచ్ అయ్యింది "

 

నా పేరు అనిత; మాది గౌరిబిదనూరు.

"హిమాలయ ధ్యానయాత్ర"లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కి వెళ్ళేటప్పుడు నాకు చాలా అలసటగా ఉంది. "సర్ నాకు ఎనర్జీ యిస్తే మేలు" అనుకుని ధ్యానానికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి అందరూ ధ్యానంలో కూర్చున్నారు. సర్ మాత్రం లేచి వున్నారు. నన్ను చూసి "రా ! నీ థాట్ నాకు టచ్ అయ్యింది" అంటూ ప్రక్కన కూర్చోబెట్టుకుని చేతిలో నా చెయ్యి పట్టుకుని మెడిటేషన్ చేయమన్నారు. సర్ నుంచి నాకు ఎనర్జీ పాస్ అయ్యింది. ధ్యానంలో పత్రిసార్ పెద్దగా అంటే భూమి మీద నిల్చొని వుండి వారి తల ఆకాశాన్ని తాకుతూ ఉంది. అక్కడ వున్న కొండలు, పూలు, ప్రకృతి అంతా కూడా ఎనర్జీని సార్ తలపై పోస్తున్నారు. సర్ తల నుంచి ఎనర్జీ వచ్చి కాళ్ళ ద్వారా నా తలపై పడుతూ వుంది. నా కాళ్ళ నుంచి ఇంకో పిరమిడ్ మాస్టర్ ‌కి వెళుతూ ఉంది. అలా పిరమిడ్ మాస్టర్స్ అందరూ అలా లింక్‌గా వున్నారు. లింక్‌లో చివరవున్న వాళ్ళనుంచి ప్రపంచం అంతా ఎనర్జీ ప్రవహించి చెట్లు, నీళ్ళు, జంతువులు అన్నిటికీ వెళ్ళి మొత్తం అంతా కూడానూ శక్తిమయంగా తయారు అయింది.

విశ్వవిఖ్యాత ధ్యానశిల్పి అయిన జగద్గురువు పత్రిసార్ తో హిమాలయయాత్ర చేసినందుకు నా జన్మసార్థకం అయింది.

 

అనిత
గౌరిబిదనూరు

Go to top