" సంకల్పసిద్ధి "

 

నా పేరు వానపల్లి నాగేశ్వరరావు.

నేను 24-6-2004 నుంచి ధ్యానం చేస్తున్నాను. మాది ధ్యాన కుటుంబం. నేను 2000 సం||లో మాంసాహారాన్ని మానివేసాను.

నాకు ధ్యానం నేర్పించినవారు మా చెల్లెలు ద్వారా పశ్చిమగోదావరి జిల్లా రమేష్ గారు. ధ్యానాంధ్రప్రదేశ్ చదువుతున్నాను. ధ్యానసాధన వలన నన్ను నేను తెలుసుకున్నాను. ఎంతో ఆనందాన్ని అనుభవించాను.

నా శరీరం నుంచి నేను బయటకు వచ్చి సూక్ష్మశరీరంలో ఒక అస్థిపంజరంలాగా కనబడింది. ఇది నా తొలి సూక్ష్మశరీర అనుభవం. ఎంతోమంది దుఃఖం, అనారోగ్యంతో బాధపడుతున్నారు అనీ, నేను పొందిన ఆనందాన్ని ప్రతి ఒక్కరు పొందాలనీ ఆత్మజ్ఞాన మార్గం వైపు నడిపించాలనే ఉద్దేశ్యంతో 1-4-2007 తేదీ మొదటీసారిగా ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణను ఏర్పాటుచేసాను. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యానరత్న శ్రీమతి వీరజగదీశ్వరి గారు, శ్రీ పడాల అమ్మిరెడ్డి గార్ల ఆధ్వర్యంలో ప్రతినెల సీనియర్ పిరమిడ్ మాస్టార్లను పంపిస్తున్నారు.

"రామచంద్రాపురంలో బ్రహ్మర్షి పత్రీజీ రావాలి" అని ప్రతిరోజు ధ్యానంలో కూర్చునేవాడిని. ఆ రోజు వచ్చింది, ఎందరో ధ్యానమిత్రులు సహాయ సహకారాలతో 15-1-09 బ్రహ్మర్షి పత్రీజీ వచ్చి ఎంతో ఆనందంతో ధ్యానులు ఆనందాన్ని పంచుకున్నారు. రామచంద్రాపురంలో మొదటిసారి పిరమిడ్ నిర్మించిన R. వెంకటనారాయణ గారికి, ధ్యానప్రచారం కోసం ధ్యానమిత్రులు ప్రతివారికి పేరు పేరునా నా ధ్యానాభివందనాలు తెలుపుతున్నాను. "నా జీవితధ్యేయం అందరినీ శాకాహారులుగా, సంపూర్ణఆరోగ్యంగా మార్చడానికి నా వంతు కృషి చేయడమే". ఈ సులభమైన మార్గం మనందరికీ చూపిన బ్రహ్మర్షి పత్రీజీ గారికి శతకోటి నమస్కారాలు.

 

వానపల్లి నాగేశ్వరరావు
పశ్చిమగోదావరి జిల్లా

Go to top