" జ్ఞాన ప్రచారం అనే ఉత్తమ సేవలో పాలుపంచుకుంటున్నాను "

 

నా పేరు పాండురంగారావు.

మాది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం.

నేను గత 30 సంవత్సరాలుగా ఆర్టోన్ బ్రెవరీస్ లిమిటిడ్‌లో పనిచేస్తున్నాను. నేను స్టోర్స్ ఆఫీస్ పదవిలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి శాకాహారిని, ఎలక్ట్రిక్, మెడికల్, హోమియో తదితర వాటిలో నాకున్న పరిజ్ఞానంతో.. ప్రజలకు నాకు తోచినంత సహాయ సహకారాలను అందిస్తున్నాను. ఎప్పుడూ నిజాయితీగా ఉండటం నా అభీష్టం.

ఒకరోజు మా స్నేహితుడు శ్రీనివాస్ ప్రోద్బలంతో మా ఫ్యాక్టరీలో సామర్లకోట ప్రసాద్ గారిచే మెడిటేషన్ క్లాసులు చెప్పించాము. అప్పటి నుంచి నాలో మార్పు వచ్చింది. తరువాత పది రోజులలో కొత్త పిరమిడ్ రామచంద్రాపురంలో ప్రారంభించబడిన సందర్భంగా పత్రీజీ క్లాసులు వినటం సంభవించింది. శివరాత్రి రోజున గొల్లలమామిడాడ పిరమిడ్‌లో నా మిత్రుడు శ్రీనివాస్, నేను కలిసి ధ్యానం చేసాం. నాలో ఎంతో అనుభూతి కలిగింది. అదేరోజు గుండారపు అప్పారావు కలిసాం. అప్పటి నుంచి ప్రతి ఆదివారం మా ఇంట్లోనే మాస్టర్లను పిలిపించి ఎన్నో క్లాసులు పెట్టాం. ఇప్పుడు రామచంద్రాపురంలో ప్రతినెల 2వ ఆదివారం క్లాసులకు తోడ్పడుతున్నాం. నేను ఉద్యోగరీత్యా నాకు వీలుపడదు కనుక ఏదో రకంగా సేవచేసి ప్రజలందర్నీ జ్ఞానులను చేయాలనే సంకల్పంతో .. ఆంధ్రప్రదేశ్‌లోని అందరి సెల్ నెంబర్లు సేకరించి, వారికి పత్రీజీ గారి ప్రసంగాల వివరాలను మారుమూలకు సైతం SMS ద్వారా అందజేస్తున్నాను. ధ్యానంలో ఎన్నో అనుభూతులు పొందాను.

అతి తక్కువ సమయంలో ఎంతో జ్ఞానం పొందాను. నాకున్న బి.పి. వంటి రోగాలు నయం చేసుకున్నాను. పత్రీజీ గారి ఆశయం పూర్తిగా నెరవేరాలని, 2012 లో రాబోయే సమస్యలు తగ్గాలనే సంకల్పంతో ఉన్నాను.

ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో 15,000 మంది మాస్టర్ల నెంబర్లు సేకరించాను. వీరికి సేత్ విజ్ఞానం, తదితర రచయితల రచనలను తెలుగులో SMS ద్వారా బిట్‌బిట్‌లుగా పంపాలని ప్రయత్నం చేస్తున్నాను.

 

పాండురంగారావు
తూర్పుగోదావరి జిల్లా

Go to top