"ఆత్మానందం అంటే ఇదేనేమో..."

 

నా పేరు అమరావతి ఆంధ్రప్రకాష్. 25 సంవత్సరాల క్రితం తమిళనాడు సేలంలో సెటిల్ అయిన ప్రవాస ఆంధ్రుణ్ణి. బ్రహ్మర్షి పత్రీజీ .. పిరమిడ్ ధ్యానం ... ఆనాపానసతి... ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో వున్న మా బంధువుల ద్వారా కలిసినప్పుడు వినేవాడిని. వారినుంచి ధ్యానం గురించి తెలుసుకున్నప్పటికీ ఊరికి వచ్చి దానిని మరచిపోయేవాడిని. నా భార్య బిడ్డలు కూడా కొంతవరకు మెడిటేషన్ చెయ్యడం మొదలుపెట్టారు. కానీ నేను మాత్రం శ్రద్ధ వహించేవాడిని కాదు.

సేలం బజారు వీధిలో నాకు రెండు అంతస్తుల బిల్డింగ్ వుంది. సెకండ్ ఫ్లోర్ ఖాళీగా వుంది. 4,000 రూపాయల బాడుగ వస్తుంది. ఓ పదిహేనురోజులలో అగ్రిమెంట్ రెడీ కావచ్చును. ఓ శుభోదయాన నిద్రలో నాకు కొన్ని సజెషన్స్ .. కొందరి మాస్టర్స్ నుంచి కాబోలు .. వచ్చాయి. "ఖాళీస్థలాన్ని పిరమిడ్ కేర్ సెంటర్‌కు ఇవ్వాలి" అని. ఆ క్షణంలో ఆ వాక్కును వేదవాక్కులా భావించాను. ఉదయం డ్యూటీకి వస్తూనే సేలం పిరమిడ్ మాస్టర్ శంకర్‌లాల్‌ను పిలిపించి నా మనోభావాన్ని తెలియచేసాను. ఆయన చాలా సంతోషించారు. "సుమారు నాలుగు సంవత్సరాల నుంచి ఇంకొక సెంటర్ తెరవాలని నాకుంది. కానీ అవకాశం దొరకలేదు. ఈ రోజు మీరు పిలిచి సెంటర్‌కు స్థలం ఇస్తున్నారంటే ఇదంతా మాస్టర్స్ చలవే" అన్నారు.

మనిషికి నిండైన ఆనందం త్యాగంలోనే .. మరి ఇవ్వడంలోనే .. వుంది. ఎందరో సామాన్యులను ధ్యానులుగా చేసే యజ్ఞంలో నేను ఒక సమిధను అన్న తలంపే నాకు పరమానందం కలిగిస్తోంది. ఆత్మానందం అంటే ఇదేనేమో ...

 

అమరావతి ఆంధ్రప్రకాష్
సేలం, తమిళనాడు

Go to top