" అద్భుతం, మహాద్భుతం "

 

27-5-06 శనివారం రోజు పత్రిసార్ జగిత్యాల వచ్చారు. పత్రీజీతో పాటు కొంతమంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్‌కు మా ఇంట్లో భోజనం ఏర్పాటు చేశాం. మాది "పిరమిడ్ హౌస్".

వంటలు అన్నీ చేసి టేబుల్ పై పెట్టి అందరికీ వడ్డించడం కోసం మూతలు తీసి ప్లేట్లలో పెట్టే సమయంలో సడన్‌గా పైకి చూడడం జరిగింది. ఒక బల్లి స్లాబ్ నుంచి క్రింద వంటల్లో పడబోయి 'మధ్య' లో ఆగింది. 'మధ్య' అంటే స్లాబ్ నుంచి ఒక అడుగు క్రింద ఏ ఆధారం లేకుండా గాలిలో.

దీనిని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము. వెంటనే ఒక బెడ్‌షీట్ తెచ్చి వంటలపై పట్టుకున్న తర్వాత బల్లి పక్కగా క్రింద పడిపోయింది. "వంటలలో పడకుండా మాస్టర్స్ వచ్చి ఆపడం జరిగింది" అని పత్రిసార్ చెప్పడం జరిగింది. "ఇంట్లో అనంతమైన బ్లూ కలర్ ఆరా ఉంది" అని చెప్పారు.

సత్యంలో ఉంటూ .. న్యాయబద్ధంగా సంపాదిస్తూ .. ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవలు చేసేవారికి గురువులు ఎప్పుడూ సదా ఇంటా, వెంటా, జంట ఉండి కాపాడుతారు. మన గురువు అయినటువంటి పత్రిసార్ మా ఇంట్లో ఉండగా ప్రకృతి ఎలా సహకరించదు?.

అందరూ ధ్యానం చేయండి. ప్రతి వ్యక్తీ ప్రతిరోజూ దినచర్యలో ఒక భాగాన్ని ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంతకన్నా మించిన భాగ్యం ఏదీ లేదు. ధ్యానం ఏవ శరణం వయమ్.

 

V. లక్ష్మీ
జగిత్యాల
కరీంనగర్ జిల్లా

Go to top