" ధ్యానం ద్వారా AUCETలో ఫస్ట్ ర్యాంక్ "

 

 

నా పేరు చంద్రరావు. నేను భీమవరం K.G.R.L.డిగ్రీ కాలేజీలో B.Sc. చదివాను. నేను మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు శ్రీ తటవర్తి వీరరాఘవరావుగారు మా కాలేజీకి వచ్చి ధ్యానం ఎలా చేయాలి, దానివలన లాభాలు చెప్పి వెంటనే 15 నిమిషాలు విద్యార్ధులందరిచేత ధ్యానం చేయించారు. ఇదే నా మొదటి ధ్యాన పరిచయం.

ప్రతిరోజూ తటవర్తి గారి ఇంటిపై వున్న పిరమిడ్‌లో ఒక గంటసేపు ధ్యానం చేస్తున్నాను. వీరరాఘవరావు గారి ఆధ్వర్యంలో భీమవరంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి మొదటి ఆదివారం జరిగే ఉచిత ధ్యానశిక్షణకు హాజరవుతున్నాను. ఒకసారి క్లాసులో మాంసాహారం గురించి చెప్పిన క్లాసు "మాంసం తింటే రాక్షసుల్లా శవాలను పీక్కుతిన్నట్లే..." విని పూర్తిగా మాంసాహారం మానేసాను. బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి పుస్తకాలు, ప్రత్యేకించి ఓషో పుస్తకాలను చదివాను. శ్రీ యుగంధర్ రాజు గారు ధ్యానంలో నా సందేహాలను నివృత్తి చేసుకోటానికి చాలా సహాయం చేసారు.

ధ్యానం వలన నా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత బాగా పెరిగాయి. ఇంతకుముందు ప్రతి విషయంలోనూ చాలా వొత్తిడి, భయం ఎదుర్కొనేవాణ్ణి. ధ్యానం చేసిన తరువాత నాలోని వొత్తిడి, భయం చాలావరకు తొలగిపోయాయి. ఇంతకుముందు ఒక పుస్తకం చదవవలసి వచ్చినప్పుడు "చదవగలనా? లేదా?" అనే భయం ఉండేది. ఇప్పుడు ఏ పుస్తకమైనా సరే నేను చదివి గుర్తుపెట్టుకోగలను. పాజిటివ్ థింకింగ్ అలవాటయ్యింది. నా ఆలోచనా విధానంలో మంచి మార్పు వచ్చింది.

స్వతహాగా నేను above average స్టూడెంట్‌‍ను. అయితే ధ్యానంలోకి వచ్చిన తరువాత నాలో చాలా మార్పు వచ్చింది. నేను ఊహించని ఫలితం సాధించాను. మే 27 వ్రాసిన AUCET లో ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాను. ఇది నాకు నమ్మశక్యం కావడం లేదు. కానీ తరువాత అర్ధమయింది బ్రహ్మర్షి పత్రీజీ అందించిన ధ్యానమే నాకు ఇది సాధించి పెట్టిందని. పత్రీజీకి నా కృతజ్ఞతలు.

ఎవరు ధ్యానం చేసినా అభివృద్ధి సాధించగలరు. ప్రతి విద్యార్ధికి ధ్యానం అవసరం. ప్రతి విద్యార్ధి ధ్యానం చేసి ఉన్నతస్థానం పొందాలని నా సూచన.

"మెడిటేషన్ + హార్డ్‌వర్క్ = సక్సెస్"

నాకు ధ్యాన పరిచయం చేసిన శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారికి నా కృతజ్ఞతలు. ప్రపంచాన్నంతటినీ ధ్యానమయం చేయటానికి అఖండంగా కృషి చేస్తూ మనందరినీ జ్ఞానులుగా తీర్చిదిద్దుతూన్న బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి నా ప్రత్యేక ధన్యవాదాలు.

 

D.చంద్రరావు
ఎట్చెర్ల, శ్రీకాకుళం జిల్లా

ఫోన్ : +91 08942 532408

Go to top