" ధ్యాన తమిళనాడు "

 

నా పేరు ఆంజనేయులు. మాది గుంటూరు జిల్లా, తుళ్ళూరు గ్రామం. బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ గారి ఆశయసాధనంగా రూపుదిద్దిన బెంగళూరు 2005 సంవత్సరం పిరమిడ్ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా మొదటిసారిగా పత్రీజీ గారిని కలిసాను. పిరమిడ్ వ్యాలీలో మూడురోజులు ఉన్నాను. మొదటి సిట్టింగ్ పత్రీజీ ఆరు గంటలు ధ్యానం చేయించారు. మూడురోజులు ఆరేసి గంటలు ధ్యానం చేసి నా ధ్యాన జీవితం ప్రారంభించాను.

ఆ తరువాత భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు గారి మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరానికి రెండు సార్లు వెళ్ళాను. రోజుకు మూడు గంటలు ధ్యానం చేయడం అలవరచుకున్నాను. పత్రీజీ సమీపంలో ఎక్కడ క్లాసులు నిర్వహించినా అక్కడికి వెళ్తూంటాను.

బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో 2006 సంవత్సరం బుద్ధపౌర్ణమి ధ్యాన మహోత్సవాల సందర్భంగా ఏడురోజులు ధ్యాన ఉత్సవాలలో పాల్గొని వచ్చిన తరువాత ధ్యాన ప్రచారం చేయాలనే సంకల్పంతో తమిళనాడు లోని ఈరోడ్ జిల్లా, కాంచికోవెల గ్రామ చుట్టుప్రక్కలలో నాకు చాలామంది స్నేహితులు ఉండడం వలన మే 30 వతేదీన అక్కడికి వెళ్ళి ఇంటి, ఇంటికీ తిరిగి ధ్యాన ప్రచారం చేసాను.

ఆ సమయంలో ... జూన్ 4,5,6 తేదీలలో ... పత్రీజీ గారి ప్రోగ్రాం తమిళనాడులో ఉండడం వలన 4 వతేదీన సేలంలో పత్రీజీ గారిని మా స్నేహితులతో కలిసాము. మళ్ళీ 6 వతేదీ కోయంబత్తూరులో పత్రీజీ గారిని కలిసాము. స్నేహితులంతా కాంచి కోవెలలో ప్రోగ్రాం పెట్టమన్నారు. అప్పుడు సార్ ఈరోడ్ మాస్టర్ డాక్టర్ శంకర్ నారాయణ గారిచే జూన్ 13 వ తేదీన ధ్యానం క్లాసు నిర్వహించమన్నారు. 13-6-2006 కాంచికోవెలలో అన్ని వసతులతో ఉన్న కొంగుమలై మెట్రి క్యులేషన్ హైస్కూలులో 9,10,11 వ తరగతులకు చెందిన మొత్తం 275 మంది పిల్లలకు డాక్టర్ శంకర్‌నారాయణ గారు క్లాసు చెప్పి 30 నిమిషాలు ధ్యానం చేయించారు. వారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.

స్కూలు ప్రధానోపాధ్యాయులు గారు అందుకు సంతోషించి "వారంలో ఒకరోజు ప్రతి వారం ధ్యాన తరగతి పెట్టండి" అని అడిగారు. అందరికీ కరపత్రాలు పంచాము. ఇంకా నాలుగు స్కూళ్ళలో క్లాసులు నిర్వహించాం.

కోయంబత్తూరు పిరమిడ్ మాస్టర్ శ్రీమతి గిరిజా రాజన్ గారు పత్రీజీ గారి గురించి చెప్తూ కేరళ ప్రోగ్రామ్‌లో గురువాయుర్ పత్రిసార్‌తో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గజాలను సందర్శించినప్పుడు పత్రిసార్‌ను చూసి ఒక గజం ముందుకు వచ్చి పాదాభివందనం చేసింది" అని చెప్పారు. ఇది ఎంతో అద్భుతమైన విషయం.

 

K.S.R. ఆంజనేయులు
తుళ్ళూరు, గుంటూరు జిల్లా

Go to top