" 108 రోజుల ఇంటింటా ధ్యానశిక్షణ కార్యక్రమం "

 

విశాఖపట్నం శ్రామికనగర్ ప్రాంతంలో పిరమిడ్ మాస్టర్ " స్వప్న " మరి మిత్రబృందం వారు నిర్వహిస్తున్న 108 రోజుల ఇంటింటా ధ్యాన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది ధ్యాన అనుభవాలు .. " ధ్యానాంధ్రప్రదేశ్ "

నా పేరు లక్ష్మి. నేను ధ్యానంలోకి రాకముందు విపరీతమైన కోపం వుండేది. నలభైరోజుల ధ్యానంలో పాల్గొన్నప్పటి నుంచి క్రమంగా నాలో మార్పు మొదలై చాలావరకు నా కోపం తగ్గింది. "

" నా పేరు మాధవి. నేను ధ్యానంలోకి రాకముందు ఎక్కువగా ఆలోచించేదాన్ని ; ధ్యానంలోకి వచ్చాక ఆలోచనలు తగ్గి ప్రశాంతంగా వుంది. "

" నా పేరు సత్య. నాకు విపరీతంగా కాళ్ళనొప్పులు వుండేవి ; అవి తగ్గాయి. ఇప్పుడు ఎంత దూరమైనా నడవగలుగుతున్నాను. "

" నా పేరు కళ్యాణి. నేను ఎక్కువ నెగెటివ్‌గా ఆలోచించేదాన్ని. ప్రతి చిన్న విషయానికీ భయపడుతూ ఉండేదాన్ని. కాని ధ్యానంలోకి వచ్చాక ఆలోచించే విధానం మారింది ; భయం పోయింది. ప్రతిక్షణం చాలా ఆనందంగా వున్నాను. "

" నా పేరు శ్రీలక్ష్మి. నాకు భుజం నొప్పి ఎక్కువగా వుండేది. అది తగ్గింది. తలనొప్పి కూడా విపరీతంగా వుండేది. టాబ్లెట్ వేసుకుంటే కానీ నొప్పి తగ్గేది కాదు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోకుండానే ధ్యానం ద్వారా తలనొప్పి తగ్గించుకున్నాను. కోపం తగ్గింది. "

" నా పేరు పద్మ. నాకు విపరీతమైన తలనొప్పి వుండేది ; టాబ్లెట్ వేసుకునేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చాక తలనొప్పి తగ్గింది. టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు. పిల్లల మీద బాగా కోపం వుండేది. అది కూడా తగ్గింది. "

" నా పేరు సుజాత. నాకు నడుమునొప్పి, తలనొప్పి, కాళ్ళనొప్పులు లాంటి చాలా ఆరోగ్య సమస్యలు వుండేవి. చాలా హాస్పిటల్స్‌కి వెళ్ళాను. చాలా మందులు వాడాను. క్రింద కూర్చుంటే పైకి లేవలేకపోయేదాన్ని. ఒకరి సాయం తీసుకునేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చాక నా ఆరోగ్య సమస్యలు అన్నీ తగ్గాయి. ఇప్పుడు నేను క్రింద కూర్చుంటున్నాను. ఏ టాబ్లెట్ చేయలేని పని ధ్యానం మాత్రమే చేయగలిగింది. చాలా ఆనందంగా వున్నాను. ఇప్పుడు నా భర్తే నన్ను ధ్యానానికి పంపిస్తున్నారు. "

" నా పేరు జగదాంబ. నాకు తలనొప్పి తగ్గింది. ఇంట్లో ఎవరైనా ఏమైనా అంటే ప్రతి చిన్న విషయానికీ బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు అవేమీ పట్టించుకోవడం లేదు ; కోపం తగ్గింది. "

" నా పేరు రమ. నాకు నిద్రపట్టేది కాదు. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేదాన్ని. నిద్రపట్టాలంటే టాబ్లెట్ వేసుకోవాల్సిందే. కానీ ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టానో అప్పటినుంచి టాబ్లెట్ వేసుకోకుండానే బాగా నిద్రపోతున్నాను. ఇంట్లో పనంతా చక్కగా చేస్తున్నాను. "

" నా పేరు అప్పలనరసమ్మ. నాకు B.P., షుగర్ వుండేవి. కాళ్ళనొప్పులు కూడా వున్నాయి. అనుకోకుండా ఒకరోజు ధ్యానం క్లాసుల గురించి తెలిసింది. చూద్దాం అని వెళ్ళాను. నలభైరోజులు ధ్యానం చేసాను. ధ్యానంతో B.P.,షుగర్ తగ్గుతాయని చెప్పారు. తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్తే ‘ B.P., షుగర్ కంట్రోల్‌లో వున్నాయి ’ అని చెప్పారు."

" నా పేరు కాంతమ్మ. నేను ధ్యానంలోకి రాకముందు ప్రతి చిన్న విషయానికీ ఇంట్లో వాళ్ళను విసుక్కునేదాన్ని. నా కోసం కన్నా పొరుగువారి కోసం ఎక్కువగా ఆలోచించేదాన్ని. అవన్నీ నెగెటివ్ ఆలోచనలే. బాగా కోపం వుండేది. మా కోడలితో ఎక్కువగా గొడవపడుతూ ఉండేదాన్ని. ప్రతి చిన్న విషయానికీ తిట్టేదాన్ని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కోపం పోయింది. ఇంట్లో అందరితోనూ ప్రేమగా ఉంటున్నాను. నెగెటివ్ ఆలోచనలు విడిచిపెట్టాను. నాలో ఈ మార్పు చూసి ధ్యానంలో ఏముందో అని తెలుసుకోవడానికి మా కోడలు కూడా వచ్చింది. మా కోడలు కూడా ధ్యానం చేస్తుంది. మా ఇంట్లో అందరం ప్రేమతో ఆనందంగా జీవిస్తున్నాం. "

" నా పేరు జగదాంబ. నాకు బాగా తలనొప్పి వుండేది. అసలు బయటకు వచ్చేదాన్ని కాదు. ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం. ధ్యానంలోకి వచ్చాక తలనొప్పి తగ్గింది. భయం పోయింది. ఇప్పుడు అందరితోనూ చక్కగా మాట్లాడుతున్నాను.

" నా పేరు రత్నం. భయం తగ్గింది. B.P. తగ్గింది. నిద్ర బాగా పడుతోంది. ఆలోచనలు తగ్గాయి. కాళ్ళు చేతులు సున్నితంగా అయ్యాయి. చాలా బాగుంది. "

 

స్వప్న
విశాఖపట్నం

Go to top