" ఆరోగ్యం పూర్తిగా నయమైంది "

 

నా పేరు అలివేలు. గ్రామం కడ్తాల్ ; మహబూబ్‌నగర్ జిల్లా. నాకు ఏడు సంవత్సరాల నుంచి ఆరోగ్యం సరిగ్గా వుండేది కాదు. నా శరీరంలో ఎడమభాగం మొత్తం సరిగ్గా పనిచేసేది కాదు మరి నాకు అల్సర్ కూడా వుండేది. ఏ పని సక్రమంగా చేసేదాన్ని కాదు. నాకు మొత్తం మానసిక అశాంతిగా వుండేది. ఎన్ని మందులు వాడినా ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ప్రయోజనం మాత్రం లేదు.

నేను రెండు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. మొదట నేను విశ్వామిత్ర పిరమిడ్‌కు వెళ్ళినప్పటి నుంచి రోజుకు మూడుగంటలు ధ్యానం చేయడం ప్రారంభించాను. ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా నయమైంది. అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతున్నాను. ఇప్పుడు నా మీద నాకు ఒక దృఢవిశ్వాసం కలిగింది. నేను ధ్యానం చేయడమే కాకుండా అందరిచేత ధ్యానం చేయిస్తున్నాను. ఈ ధ్యానం అందజేసిన పత్రీజీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.

 

అలివేలు
కడ్తాల్

Go to top