" తూర్పుగోదావరిలో ధ్యాన మండలాలు "

 

నా పేరు అడబాల శ్రీనివాసరావు, కాకినాడ.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం శ్రీ D.కేశవరాజు, శ్రీ D.రాయజగపతిరాజు గార్ల ఆధ్వర్యంలో తూర్పుగోదావరి అంతా పూర్తి ధ్యానమయం అయింది. ఈ గోదావరి ధ్యానయజ్ఞంలో నేను కూడా పాల్గొనడం వలన నా జన్మ సుకృతమైంది. ముఖ్యంగా ఏజెన్సీలో స్కూలు పిల్లలు వారి అంతట వారు ప్రతిరోజూ ధ్యానం చేస్తామనీ, మాంసాహారం మానివేస్తామనీ, పూర్తి శాకాహారులుగా అవుతామనీ మాట ఇచ్చారు. అలాగే అన్ని మండలాలలో కూడా చాలామంది ప్రజాప్రతినిధులు, M.P.D లు మాంసాహారం మానివేసి పూర్తి శాకాహరులుగా అవుతామని మాట ఇచ్చారు. ఈ రోజు పత్రీజీ వలన కొన్ని లక్షల జీవులు బ్రతికాయి. " ఏ జీవి కూడా చంపబడకూడదు " అనే నినాదంతో శాకాహార సమ్మేళనం మారం శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. ఈ కార్యక్రమం అన్ని జిల్లాలలో జరగలాని కోరుకుంటున్నాను.

 

అడబాల శ్రీనివాసరావు
కాకినాడ
ఫోన్ : +91 94901 86220

Go to top