"ఎంతో మంది గ్రహాంతరవాసులను చూశాను"

 

మారం : మీకు ధ్యానం చెయ్యాలని ఎందుకు అనిపించింది?

గుణా : చాలా చిన్న వయస్సు నుంచే ధర్మమార్గంలో జీవిస్తూ, ధర్మం గురించి బోధించాలని నాకు వుండేది. భారతం, రామాయణం బాగా చదివాను. బహుశా, 6వ తరగతిలో అనుకుంటాను, నేను వాకింగ్ చేస్తున్నప్పుడు 15 నుంచి 20 నిమిషాలు శూన్యస్థితిని అనుభవించాను. మళ్ళీ ప్రయత్నించాను .. అటువంటి స్థితికోసం ఎన్నోసార్లు, ఎంప్టీనెస్ వచ్చేది కానీ, ఊపిరి ఆగిపోయినట్లుండేది.

రాను రాను అక్కల్ట్‌సైన్స్ చాలా ఫెమిలియర్‌గా అనిపించేది. "ఇది సత్యం" అనేవాడిని. సందేహం వచ్చేది కాదు.

పుట్టపర్తిలో ఇంటర్మీడియట్ చదివాను. ఆధ్యాత్మికత గురించి బల్లగుద్ది వాదించేవాడిని. సత్యసాయిబాబా పట్ల ఎంతో ప్రభావితుడనయ్యాను. ఐ యూజ్‌డ్ టు లవ్ హిమ్.

ఇంజనీరింగ్ అయిన తర్వాత కర్నూలులో ఉద్యోగ ప్రయత్నం చేశాను. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కోసం రోజుకు 16 గంటలు చదివి ఎగ్జామ్స్ వ్రాశాను. ఎగ్జామ్స్ అయిపోయిన మూడవరోజు నుంచి ఆధ్యాత్మికంగా జీవించాలనే తపన రోజురోజుకు పెరిగిపోయింది. ఐ డిసైడెడ్ టు బి ఇన్ స్పిరిచ్యువాలిటీ. చదివే వీలున్నా, డిఫెన్స్‌కు వెళ్ళే వీలున్నా, ఫారిన్ ఛాన్స్ వచ్చినా వెళ్ళలేదు.

ఒక పిరమిడ్ పాంప్లెట్ చూసి 1992 మార్చి 24 సాయంత్రం బ్రహ్మర్షి పత్రీజీని మొట్టమొదటిసారిగా కలిశాను. నేను, నా స్నేహితుడొకరు వచ్చాం ... ఫ్లూయెంట్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్‌లో లెక్చర్ ఇచ్చారు ఆయన.

మూడవరోజు ధ్యానం చేస్తున్నప్పుడు నా ఫోర్‌హెడ్ నుంచి కొన్ని నక్షత్రాలు వచ్చినట్లుగా అద్భుతమైన అనుభూతిని పొందాను. పత్రీజీకి చెప్పాను. ధ్యానం రెగ్యులర్‌గా చేయమని నన్ను వారు ప్రోత్సహించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ, కర్నూలు పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ పొందేవాడిని.

1992 ఏప్రిల్ 9న, అనంతపూర్‌లో పోస్టింగ్ వచ్చింది. అక్కడ నేను ఒంటరివాడిని అయిపోయాను. అయితే 'ధ్యానం', 'ఉద్యోగం' తప్ప వేరే ఆలోచన లేదు. ప్రతిరోజూ డైరీ వ్రాసేవాడిని. రోజులో 5,6 గంటలు మెడిటేషన్ చేసేవాడిని. పడుకుని కళ్ళు మూసుకున్నా నా ఆస్ట్రల్ బాడీ నా మీద కూర్చుని ధ్యానం చేసేది. దాదాపు పత్రీజీ చెప్పిన అన్ని విషయాలు, నేను ఆస్ట్రల్ బాడీతో ఎక్స్‌పెర్‌మెంట్ చేశాను. నాకు సందేహం ఉండేది కాదు. వచ్చేది కాదు. ఎన్నో సూక్ష్మలోకాలు చూసాను. కొన్ని ఆస్ట్రల్ వరల్డ్స్ ఖాళీగా ఉండేవి.

మారం : ఎందుకని ఖాళీగా ఉండేవి?

గుణా : అక్కడ వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఆ నగరాలు ఖాళీగా అయిపోయేవి.

మారం : ఆ నగరాలను గురించి వర్ణించండి.

గుణా : దట్ గ్లో ఈజ్ బ్యూటీఫుల్. వాటిల్లో ఎన్నో ఆస్ట్రల్ పిరమిడ్స్ వుండేవి. నేను ఎంతో ఎనర్జీని అక్కడ గెయిన్ చేశాను. స్వర్గ, నరకాలు కూడా చూశాను. ఎంతోమంది గ్రహాంతర వాసులను నేను చూశాను. వాళ్ళు 12,14 అడుగుల ఎత్తుతో, ఎంతో బలిష్టంగా వుండేవారు. అటువంటి లోకాలను, ఆస్ట్రల్ బీయింగ్స్‌ను ధ్యానంలో చూడడం ఎంతైన ఆనందంగా ఉండేది.

మారం : ధ్యానంలో మాస్టర్లను చూడడం, సంభాషించడం గురించి చెప్పండి.

గుణ : హనుమాన్ మాస్టర్‌తో మాట్లాడినప్పుడు ఆయన, భూలోకంలో తారస్థాయిలో పాపాలు చేసి బాడీ వెకేట్ చేసిన ఒక వ్యక్తి గురించి చెప్పారు. అతడు మళ్ళీ ఒక జన్మ తీసుకుని, ఒక గుహలో వుండడం చూపించారు. అతడు ఒక జీవచ్ఛవంలా పడి వున్నాడు. మనిషి శరీరంలో వున్న ఓ మృగంలా. మృగం నుంచి ఆటవికునిగా, మనిషిగా, సంఘజీవిగా అతను మారడానికి కొన్ని యుగాలు పడుతుంది అనిపించింది. అలా ఎంతోమంది మాస్టర్లతో ఎన్నో అనుభవాలు.

మారం : పత్రిసార్‌తో మీ రిలేషన్ ఎలా వుండేది?

గుణా : పత్రిసార్‌తో చాలా క్లోజ్‌గా వుండేది నా రిలేషన్. ఎన్నో ప్రశ్నలు వేసేవాడిని. సమయం, సందర్భం లేకుండా ఆయన ఇరిటేట్ అయినా లెక్కచేసేవాడినికాదు. ఆయన కరుణకు హద్దే లేదు. అంత బాగా చూసుకున్నారు నన్ను.

మారం : ఇంకా మీ అద్భుత అనుభవాలు గురించి చెప్పండి. మీరు చదివిన పుస్తకాల గురించి కూడా.

గుణా : ఏదైనా పుస్తకం చదువుతూ వుంటే, ఆ పుస్తకానికి సంబంధించిన విశేషాలు, వివరణల కోసం క్షణంలో ఒక థాట్‌తో ఆస్ట్రల్ ట్రావెల్ చేసేవాడిని. అన్ని సందేహాలూ తీర్చుకునేవాడిని. ఇక ఎక్స్‌పీరియన్సెస్ మీద్ మోజు పోయింది. పత్రిసార్ బుక్స్ ఇంకా ఇంకా ఇవ్వడం మొదలుపెట్టారు.

పత్రిసార్ నాకు ఇచ్చిన మొదటి పుస్తకం "ఇల్యూషన్స్" - రిచార్డ్‌బాక్ వ్రాసినది. ఇదే పుస్తకం "మహాపరిసత్యాలు" అన్న పేరుతో తెలుగు అనువాదంగా వచ్చింది. ఇల్యూషన్స్‌తో మొదలుపెట్టిన గ్రంథ జిజ్ఞాస ఎన్నో పుస్తకాలు చదివిన తరువాత "కార్లోస్ కాస్టనెడా" పుస్తకాలు అన్నీ చదవడంతొ తృప్తి తీరింది. కుండ నిండింది. తర్వాత "సేత్" పుస్తకాలు చదివాను. మన ఉపనిషత్తులను ఇంగ్లీషులో న్యూ ఏజ్‌కి తగినవిధంగా వ్రాశారా అన్నంత గంభీరంగా ఉన్నాయి "సేత్" రచనలు.

మారం : మీరు ఇన్ని ఎక్స్‌పీరియన్సెస్ పొందారు. ఎన్నో పుస్తకాలు చదివారు. పత్రిసార్‌తో ఎంతో క్లోజ్‌గా, ఆత్మీయంగా గడిపారు. ఈ మూడు అత్యుత్తమ విషయాలే. ఏది 'గ్రేట్' అనిపించింది ఈ మూడింటిలో?

గుణా : ఒక మనిషి స్పిరిచ్యువాలిటీలో ఒక సత్యాన్ని గ్రహించాలంటే, ఒక శాస్త్ర వాక్యముండాలి. దాన్ని గురువు దృవీకరించాలి. అది అనుభవంలోకి రావాలి. ఈ మూడు కూడా 'త్రికరణ శుద్ధి' లాంటివి. ఈ మూడూ పండితే ఏ సందేహమూ ఉండదు. ఏ ఒక్కటి లోపించినా, ఏదో కొరత వుంటుంది. ఐ యామ్ సో లక్కీ. నాకు ఏ కొరతా లేదు, రాలేదు. నా దృష్టిలో ఈ మూడూ గొప్పవే.

మారం : పత్రిసార్ ప్రతి పిరమిడ్ మాస్టర్‌కి ఎంతో బాధ్యత ఇచ్చారు. ధ్యానంలో ప్రవేశించిన నాటి నుంచే, క్లాసులు చెప్పడం మొదలుపెట్టిన వాళ్ళున్నారు. మీగురించి?

గుణా : మొదట నేను పొందిన పరిజ్ఞానాన్ని మా అత్తగారింట్లో చెప్పడం మొదలుపెట్టాను. అంటే ధ్యానం నేర్పించడం అనే విషయాన్ని నాకు నేను ట్రైన్ చేసుకోవడన్నమాట. క్రొత్త అల్లుడిని కాబట్టి, వాళ్ళు నన్ను ఓపికగా భరించేవాళ్ళు. వాళ్ళు మాంసాహారులు. వాళ్ళు మాంసం తింటూ వుంటే వాళ్ళు శవాలను తింటున్నట్లుగా ఫీలయ్యేవాడిని.

నా ధ్యానం క్లాసులు నేను ధర్మవరంలో మొదలుపెట్టాను. నన్ను నేను ట్రైన్ చేసుకునే విషయంలో ధర్మవరం వాళ్ళు ఇచ్చిన సహకారాన్ని నేను మరవలేదు. అక్కడ నన్ను నేను సాన పెట్టుకున్నాను.

ఆ తర్వాత, అనంతపురంలో అంతా సీనియర్ మాస్టర్లే వున్నా, శ్రద్ధగా వినేవాళ్ళు తక్కువ అనిపించేది. ఆ తర్వాత నేను అనంతపూర్ మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేసి, ఆదివారాలు క్లాసులు తీసుకోవడం మొదలుపెట్టాను. ఎక్కడ క్లాసులు తీసుకున్నా హౌస్‌ఫుల్ అయ్యేవి. అయితే నేను ఎక్కువుగా బయటకు పోలేదు. సీనియర్స్‌తో బాగా ఎక్కువుగా డిస్కస్ చేసేవాడిని. సోమవారం నుండి ఆదివారం దాకా ప్రిపేర్ అయి, ఆదివారం రోజు క్లాస్ తీసుకునేవాడిని. ఏదో కాకతాళీయంగా చెప్పకుండా, ప్రిపేర్‌డ్‌గా, కమిటెడ్‌గా చెప్పేవాడిని. నేను చెప్పిన ఏ క్లాస్ అయినా నాకు ఎంతో ఆత్మ తృప్తిగా వుండేది.

మారం : ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత భౌతికంగా మీరు పొందిన గొప్ప అనుభూతి?

గుణా : "ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని కొలీగ్స్ ఎవ్వరి సహకారం లేకుండా పూర్తిగా నేను ఒక్కడినే హ్యాండిల్ చేయాలి" ... అని థాట్ ఒకసారి నాలో నుంచి రిలీజ్ అయ్యింది. ఆ థాట్ కర్నూలులోనే పూర్తి అయ్యింది. నాకు ఒక ప్రాజెక్ట్ అప్పగించబడి, ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి పూర్తిగా ఐదు సంవత్సరాలు పట్టింది .. కంప్లీట్ జాబ్ సాటిస్‌ఫ్యాక్షన్. ఇది కూడా, నేను బయటి ఊళ్ళకు వెళ్ళి క్లాసులు చెప్పే వీలు లేకుండా పోవడానికి ఒక ముఖ్యకారణం. అప్పగించిన ప్రాజెక్ట్ ఒక్కడినే పూర్తిచేసిన తర్వాత పూర్తి సంతృప్తి కలిగింది. ఐ ఫుల్‌ఫిల్డ్ మై గోల్ ఇన్ ఫీల్డ్ వర్క్. ఆ తర్వాత ఆటోమెటిక్‌గా ఆఫీస్ పోస్ట్ వచ్చింది.

మారం : ఆ ప్రాజెక్ట్ మీరు ఒంటిచేత్తో హ్యాండిల్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు?

గుణా : జాబ్‌లో .. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్‌లో ... కొన్ని లిమిటేషన్స్ వుంటాయి. మనపైన ఎంతోమంది ఉన్నతాధికారుల ఆధిపత్యం ఉంటుంది. అది అవసరం కూడా. ఆ లిమిటేషన్స్ వల్ల, ఆ జాబ్ బాధ్యతల కోసమే, జాబ్ విషయాలకే ఎంతో ఎనర్జీ ఖర్చు అయ్యేది. చాలాసార్లు 'లోఎనర్జిటిక్' గా అనిపించేది. వితవుట్ లిమిటేషన్స్ ... అన్నది ... ఒక్క స్పిరిచ్యువల్ వర్క్‌లోనే సాధ్యం. సహజంగానే ఫిజికల్ వర్క్ ఏదైనా సరే, మనపై ఎవరిదో ఒకరి అదుపు వుంటుంది. ఆటోమ్యాటికల్లీ వి లూజ్ ఎనర్జీ. ఇది నా సంపూర్ణ అనుభవం. కనుక, ఆధ్యాత్మిక శక్తి .. స్పిరిచ్యువల్ ఎనర్జీ .. ఎప్పుడూ, ఎవరికైనా అవసరమే. అయితే 'జ్ఞానపరం' గా మాత్రం నేను ఎప్పుడూ వీక్ కాలేదు.

అయితే, ఈ ప్రాజెక్ట్ నాకు ఎంత ఓవర్ లోడ్ అయ్యిందో చెప్పలేను. ఈ ప్రాజెక్ట్ నాకు అప్పజెప్పబడిన ఏడెనిమిది నెలల తరువాత ప్రతివారం మా సీనియర్ ఆఫీసర్స్‌తో నన్ను ఈ డ్యూటీ నుంచి తప్పించమని అడిగేవాడిని. అయితే, ఎంత డీప్ థాట్ రిలీజ్ చేశానో ఏమో ... వితవుట్ ప్రోపర్ ప్లానింగ్ థాట్ రిలీజ్ అవడం వల్ల ఎంతో పెద్ద బాధ్యతను మోయవలసి వచ్చింది. ఏ ఇంజనీర్ ఆ వర్క్ చేయడానికి వచ్చినా, ఎవరూ నిలబడలేకపోయేవారు. ఐ యామ్ ఫోర్స్‌డ్ టు డూ దిస్ వర్క్.

దీనివల్ల నాకు అర్ధం అయిందేమంటే, ఎవరి అర్హత ప్రకారం వారికి ఆస్ట్రల్ మాస్టర్స్ వర్క్ ఇస్తారు. "నేను త్వరగా ఎదగాలి" అని కానీ, తెలియని ఉత్సాహంతో కానీ నువ్వు బలంగ కోరినట్లయితే అది ఏ రంగం అయినా సరే నీకు అవకాశం ఇస్తారు. ఎంచుకునేటప్పుడే, బరిలో దిగేటప్పుడే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఆలోంచిచుకోవాలి .. అంతేగానీ, దిగిన తరువాత డూ ఆర్ డై, నీకు ఇక ఎలాంటి సహాయం వుండదు. కనుక ఏదైనా థాట్ రిలీజ్ చేసేముందు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నా అనుభవం.

మారం : స్పిరిచ్యువల్ సైన్స్ పై మీ అభిప్రాయం?

గుణా : స్పిరిచ్యువల్ సైన్స్ అనేది అందరికీ తెలిసిన సర్వసాధారణమైన శాస్త్రమని నాకు అనిపిస్తుంది. ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాలు భౌతిక జీవితానికి సంబంధించి ఎన్నో బాధ్యతలు కష్టం కానీ, ధ్యానం చేయడం, అనుభవాలు పొందడం అన్నది మాత్రం అతిసులభమైన పని అని నా అభిప్రాయం. ఎవరైనా "ఎక్స్‌పీరియన్స్ రాలేదు" అని బాధపడుతూంటే వాళ్ళకోసం నేను ధ్యానానికి కూర్చునేవాడిని. వారి అపనమ్మకానికి నాద్వారా కొంతైనా తెరపడితే చాలు. ఇది నా బలమైన కోరిక.

మారం : మరి ఇంత సులభమైన పరిజ్ఞానాన్ని అందరూ ఎందుకు పొందలేకపోతున్నారు? మరిన్ని పనికిరాని కర్మలు చేస్తూ అనవసరపు బరువును నెత్తిన పెట్టుకుని ఎందుకు మోస్తున్నారు?

గుణా : కేవలం అజ్ఞానం వల్ల. వాస్తవానికి ఒక గంట ధ్యానం చేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు. కానీ, ఎంతసేపూ ఇతరుల నెత్తిమీద చేయి పెట్టాలనీ, ఎదుటివాడిని దోచుకుతినాలనీ, ఈజీ డబ్బు సంపాదించాలనీ .. ఇటువంటి ఆలోచనలు ఈ మనుషుల్లో వున్నంతసేపు, ఎవరూ ఏమీ చేయలేరు. వాళ్ళ బ్యాక్ పాకెట్‌లో ఎంతో సంపద వుందని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారంటే అది వాళ్ళ దురాశ, మోహం. ఒక్కసారి ధ్యానం చేసి, విదుల్చుకుని, ఎవళ్ళ లోపలికి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ బ్యాక్ ప్యాకెట్‌లోని జ్ఞానసంపద వాళ్ళకు అవగతమవుతుంది. సత్యం సువిదతమవుతుంది.

మారం : మానవజన్మ తరువాత మళ్ళీ వెనుక జన్మలు అంటే పశు, పక్షి, జంతు జన్మలు రావు. ప్రతి మనిషికీ సుమారు నాలుగువందల జన్మలు ఉంటాయి. ఈ నాలుగువందల జన్మల్లో ఏదో ఒక జన్మలో మనిషి ముక్తి పొందుతాడు అని పత్రీజీ ఒక సందర్భంలో చెప్పారు. మీ కామెంట్?

గుణా : మనిషిగా జన్మించినా, జంతు ప్రవృత్తి నుంచి బయటకు రాలేకపోవడం వల్ల, మాంసాహారం తినడం వల్ల, రాక్షస ప్రవృత్తి లాంటి గుణగణాలు మారలేకపోవడం వల్ల అతడు నిజమైన వ్యక్తిత్వమున్న మనిషిగా మారడానికి నాలుగువందలు జన్మలు కూడా చాలనంత కర్మ పెంచుకుంటున్నారు. అలాంటివాళ్ళు మారకపోతే నాలుగువేల జన్మలు కూడా ముక్తి పొందటానికి చాలవేమో,? అందుకే ప్రతి ఒక్కరూ తప్పకుండా ధ్యానం చేయాలి. జ్ఞానం పొందాలి. అప్పుడే సాధ్యం ముక్తి. ఒకే జన్మలో కూడా ఇదే పత్రీజీ ఎప్పుడూ చెప్పేది.

మారం : కర్మసిద్ధాంతం గురించి?

గుణా : చరాచర ప్రపంచంలోని ప్రతి కదలిక, కూడా కర్మ సిద్ధాంతానికి లోబడినదే. అది నా స్వీయ జీవితంలో నాకు చక్కగా అనుభవమైన సత్యం. పద్నాలుగు సంవత్సరాల ధ్యాన జీవితం. "ఏది పాపం? ఏది పుణ్యం? అనేది నాకు చక్కగా అర్ధం కావడానికి ఇంత సమయం పట్టింది. ఇప్పుడు తప్పు చేయమన్నా నేను చేయలేను. "అనుభవమే జ్ఞానం" అన్న కాన్సెప్ట్ ప్రకారం ఒక ఎన్‌లైటెన్‌డ్ మాస్టర్ చక్కగా జీవించగలుగుతాడు. ధ్యానం వలన ఎన్నో లాభాలు ... తప్పు చేయకుండా వుండగలగడం అతి ముఖ్యమైన లాభం. అంతటికీ కారణం గురుసేవ, గురువు ప్రసాదించిన జ్ఞానం, గురువు ఋణం కొంతైనా తీర్చుకోవడానికి చేసిన కృషి. నేను ఎంతోమంది గురువులను దర్శించాను. ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను ఎంతో పొందాను.

మారం : కర్మలను గురించి మరింత వివరణ ఇవ్వండి.

గుణా : మనలో వున్న అన్ని శరీరాలు, అన్ని కోశాలూ, అన్ని చక్రాలు ఎంతో అన్యోన్య సంబంధంతో ఎన్ని పొందినా ... ఇవన్నీ కూడా ఫిజికల్ లైఫ్‌కు సంబంధించినవే. అయితే తనను తాను తెలుసుకున్న వ్యక్తి ఒక సాక్షిగానూ, ఆక్సెప్టెన్స్‌లో వుండేవాడిగానూ, ఆనందంతో వుండేవాడిగానూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే సత్, చిత్, ఆనందంలో వుంటాడు. ఇదే నిజమైన స్థితి. దీన్ని కర్మలను అధిగమించిన స్థితి అనుకోండి, కర్మలు దగ్ధమైన స్థితి అనుకోండి, ఇంకేమైనా అనుకోండి. వన్ హాస్ టు అట్టెయిన్ దిస్ స్టేజ్.

మారం : మీకు అతి ఎక్కువ ఎనర్జీ పొందిన ఫీలింగ్ లేదా స్థితి గురించి చెప్పండి.

గుణా : హిమలయాలు దర్శనంతో నేనెంతో ఎనర్జీ పొందిన అనుభూతి. ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ వల్ల, పిరమిడ్‌లో ధ్యానాల వల్ల, ఎన్నో క్లాసులు తీసుకున్నప్పటికీ, ఎక్కువ ఎనర్జీ నాకు హిమాలయ దర్శనం వల్ల హిమాలయాల్లో ధ్యానం చేసినప్పుడు, పత్రిసార్ సాంగత్యం చేసినప్పుడు కలిగింది.

మారం : మీరు పొందిన ఇంత ఎనర్జీతో, ఇన్ని ఎక్స్‌పీరియన్స్‌తో, ఇంత ఆచార్య సాంగత్యంతో, ఇంత ధ్యానం తరువాత ఇంకా ఏమైనా పొందాలని, ఇంకా ఏదైనా సాధించాలని అనిపిస్తుందా?

గుణా : నాకైతే జీవితం అంతా ఇదేవిధంగ సత్సాంగత్యంతోనూ, ఈ నిత్య అనుభూతులతోనూ, బ్రహ్మర్షి పత్రీజీ లాంటి ఆచార్యులతోనూ జీవితమంతా గడుపుతూ, నిత్యానందంతో జీవించాలని అనిపిస్తూ వుంటుంది. అయితే, సమాజంలోని, ప్రపంచంలోని ఈ దోపిడీ వ్యవస్థను, ఈ టెర్రరిజాన్ని, ఈ అధికార వ్యామోహాలను చూస్తూ వుంటే, ఈ మనుష్యుల అజ్ఞానాన్ని చూస్తూ వుంటే, ఎంత విచిత్రమో అనిపిస్తుంది. "ఇంత స్వార్ధం అవసరమా" అనిపిస్తుంది.

మారం : పత్రీజీలో కనిపించిన ఒక గొప్ప అనుభూతి కానీ, సత్యం కానీ ఇంకేదైనా అద్భుతం కానీ చెప్పండి.

గుణా : నేను చదివిన శాస్త్ర జ్ఞానం, నా అనుభవ జ్ఞానానికి గురువాక్యం ఎన్నోసార్లు తోడయి, నాకు సత్య నిరూపణ అయ్యింది. ఎన్నోసార్లు నాకు వచ్చిన సందేహాలకు పత్రిసార్ ఎంతో దూరంలో ఉన్నప్పుడు కూడా ఆయన సడన్‌గా అక్కడ కనపడి క్లారిఫై చేసి వెంటనే మాయమైన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో.

ప్రతిసారి కూడా ఆయన చెప్పే కొత్త కాన్సెప్ట్ ఎంత స్పాంటేనియస్‌‍గా ఉంటుందంటే అంత సహజంగా ఉంటుందంతే... ఇది నాకు వారిలో కనిపించిన అద్భుతం. ఎన్నోసార్లు మనం ఎంతో శ్రమపడి సాధించిన విషయాన్ని ఒక దూదిపింజలాగా తేల్చేస్తారాయన. నాకున్న ఆసక్తి కొద్దీ ఎంతోమంది గురువులను చూశాను. ఎంతోమంది మహానీయులను చూశాను. అయితే ఇంత గొప్ప గురువు, దరికి చేర్చేవాడు, దాటించేవాడు మాత్రం పత్రీజీయే. హీ ఈజ్ యాన్ ఎవర్‌గ్రీన్ గురు.

మారం : మీకు అత్యంత తృప్తి కలిగించే విషయం?

గుణా : ఇక్కడ అంటే కర్నూలు పిరమిడ్‌లో, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో వుండడం తృప్తి. ఇంకా బుక్స్, పబ్లికేషన్స్ నాకు ఎంతో తృప్తి కలిగించేవి. అన్నింటినీ మించిన తృప్తి బ్రహ్మర్షి పత్రీజీ సాంగత్యం.

మారం : నాన్ వెజ్?

గుణా : అది ఒక నికృష్టమైన పాపం దట్సాల్.

మారం : మనిషికి ఎన్నో వ్యసనాలుంటాయి. వాటి నుండి ఓవర్‌కమ్ కావడం ఎలా?

గుణా : ఒకసారి, కర్నూలు పిరమిడ్‌లో, ఒక వృద్ధురాలు పత్రీజీని అడిగింది. "సార్, నా కొడుకు ఈ మధ్యలో సిగరెట్ త్రాగడం అలవాటు చేసుకున్నాడు. ఎలా నాయనా వాడిని మార్చేది?" అని అడిగింది. అందుకు పత్రీజీ "ఈ ప్రపంచంలో వున్నవి రెండే దుర్వ్యసనాలు. ఒకటి సమయాన్ని వృధా చేయడం, రెండు నోరు పారేసుకోవడం. మిగతా ఏ వ్యసనాలు అస్సలు వ్యసనాల క్రింద లెక్కే కాదు. వెళ్ళు. నీ కొడుకుతో ధ్యానం చేయించు. అన్నీ చక్కబడతాయి" అన్నారు.

ఎవరైనా దేన్నుంచైనా, ఏ వ్యసనం నుంచైనా బయటికి రావచ్చు. కానీ వృధా అయిన సమయాన్ని .. జారిన మాటలను... మాత్రం తెచ్చుకోవడం ఎవరికైనా సాధ్యం కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకుని సమయాన్ని సద్వినియోగం చేయాలి. మాటను జాగ్రత్తగా మాట్లాడాలి.

మారం : ముక్తి, మోక్షం, స్వర్గం , లిబరేషన్, సాల్వేషన్ ... వీటిపై మీ అభిప్రాయం?

గుణా : నువ్వు చేయగల్గిన అత్యంత ఉత్తమమైన కర్మ ఏదైనా వుంటే అది ఒక్క ధ్యానం మాత్రమే. ఆ తరువాత చెయ్యవలసింది దాన్ని ఇతరులతో పంచుకోవడమే. కనుక ధ్యానం చేయండి, చేయండి, చేయండి. ధ్యానం వీలయినంత ఎక్కువమందికి చెప్పండి, చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పండి.

Go to top