" ఆనాపానసతి ధ్యానం గురించి ప్రముఖల ప్రవచనాలు అభిప్రాయాలు "

 

శ్రీ సురేష్ బామ్రే : (పోలీస్ ఇన్‌స్పెక్టర్, కోపర్ గాంవ్): "పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడూ టెన్షన్ వుంటుంది. ఈ ఆనాపానసతి ధ్యానం పోలీసులకు ఒక వరం లాంటిది. కాబట్టి పోలీసులంతా అనునిత్యం ధ్యానం చెయ్యాలి. బ్రహ్మర్షి పత్రీజీ గారి ధ్యానయజ్ఞం కోపర్‌గావ్ లో జరిగినప్పుడు నేను నా పై ఆఫీసర్‌ను కూడా ఆహ్వానిస్తా. అలాగే పోలీసులంతా తమ తమ కుటుంబాలతో తప్పకుండా హాజరు కావాలి."

రాస్‌కర్ దాదా :(ఫ్రీలాంస్ జర్నలిస్ట్): "నాకు ఎంతోమంది గురువులతో సన్నిహిత సంబంధాలున్నాయి. నాకు వారు ధ్యానం గురించి కూడా చెప్పారు. కానీ అవేవీ నన్ను స్థిమిత పరచలేదు. ఆనాపానసతి ధ్యానం గురించి తెలిసిన తర్వాత మొదటిరోజు 40 నిమిషాలు, రెండవరోజు నుంచి రోజుకు ఒక గంటసేపు ధ్యానం చేస్తున్నాను. నాకు ఎంతో ప్రశాంతత వచ్చింది. ఇంతకుముందు మధ్యాహ్నం వరకు అలసిపోయేవాడిని. కానీ ఇప్పుడు రాత్రివరకు పనిచేసినా అలసిపోవడం లేదు. నాలోకి క్రొత్త శక్తి వస్తున్నట్లుగా అనుభూతి చెందుతున్నాను. ఇంత సరళమైన ధ్యానం గురించి ప్రతి ఒక్కరికీ తెలియచేయాలి కాబట్టి అక్టోబర్‌‍లో జరగబోయే బ్రహ్మర్షి పత్రీజీ గారి ధ్యాన యజ్ఞానికి మీడియా ద్వారా విస్తృత ధ్యాన ప్రచారం కల్పిస్తాను."

మనోహర్ జోషి, (లోక్‌సత్తా విలేఖరి): " మనిషి దైనందిన జీవితంలో ధ్యానం తప్పనిసరిగా ఒక భాగం కావాలి. నేను ఇంతకుముందు 'ధ్యానం అంటే హిమాలయాలలో ఋషులు చేసే ప్రక్రియ' అనుకునేవాడిని. ధ్యానం అంటే ఇంత సులభంగా వుంటుందని నేను అనుకోలేదు. కేవలం డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చే ఈ రోజుల్లో ఎలాంటి రుసుము లేకుండా, అందరికీ ధ్యానాన్ని పంచుతున్న బ్రహ్మర్షి పత్రీజీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరు ఇతర విలేఖరులతో కలిసి అన్ని పత్రికలలోనూ ధ్యానానికి విశేష ప్రచారం కల్పించారు.

గవాండే, (అడ్వకేట్): "ఒక ముద్దాయి కంటే, ఆ ముద్దాయిని రక్షించే ప్రయత్నంలో మేము ఎక్కువుగా ఆలోచించవలసి వస్తుంది. ఈ ఆలోచనల వల్ల మాకు టెన్షన్ రావడమే కాకుండా, బి.పి., షుగర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం వుంది. ఈరోజు ఆనాపానసతి ధ్యానం చేసిన తర్వాత చాలా రిలాక్స్‌గా ఫీలయ్యాను. ప్రతి ఒక్కరు ప్రశాంతమైన జీవితం కొరకు ఈ ధ్యానాన్ని ఆచరించాలి."

 

బండిపల్లి రామయ్య
సిద్ధిపేట

Go to top