" స్రవంతి ధ్యానానుభవాలు "

 

వర్క్‌షాప్‌లో అనుభవం

స్రవంతి పైమా : "పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ మరి బ్రెత్‌వర్క్ చేసినప్పుడు తల్లి గర్భంలో చిన్న శిశువుగా వున్న నన్ను అలాగే మూడవబిడ్డగా నాకు జన్మ ఇచ్చేందుకు మా అమ్మకు ఇష్టంగా లేని ఆలోచనల వల్ల నేను ఆ తల్లిగర్భాన్ని అదేపనిగా తంతూ బయటికి వచ్చేయాలన్న భావం. సూక్ష్మలోకవాసులతో జ్ఞానం, నా ఏడు శరీరాలను చూసుకోవటం అలాగే అద్భుతమైన రిలాక్సేషన్ మరి తదుపరి ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది.

"కార్డియాక్ న్యూరోసిస్‌తో బాధపడుతూ ఎప్పుడూ భయం, చేతులు వణకటం, తప్పుడు పనులు చేసానన్న భావాలతో సతమతమయ్యే నాకు 'నిమ్స్' హైదరాబాద్ డాక్టర్ గారు సైకాలజిస్ట్‌ను కలవమని, ధ్యానం చేసుకోమని చెప్పటం, డాక్టర్ హరిగారిని కలవటం గత జన్మలో బ్రిటిష్ వారికి ఎదురుతిరగగా వారు కాల్చిన తుపాకీ గుండు హృదయంలో నొప్పి ప్రాంతంలోనే తగలటం, అదే అనుభవాన్ని పూర్తిగా పొంది డాక్టర్ హరి సజెషన్స్‌తో దూరం చేసుకోవటం జరిగింది. రెండవరోజున నా చేతి వణుకుడు పూర్తిగా తగ్గి, ఇరవై సంవత్సరాల నుంచి సంతకం చేయాలంటే కష్టంగా వున్న నాకు సునాయసంగా చేయగలుగుతున్నాను.

 

స్రవంతి
హైదరాబాద్

Go to top