" ధ్యాన మహిమ "

 

1945 ఆగష్టు 9 న 'లిటిల్‌బాయ్' అని పేరు పెట్టబడిన అణుబాంబును తీసుకుని యుద్ధవిమానం ఒకటి టినియన్ ద్వీపం నుండి బయలుదేరింది. ఆ బాంబును వేయాలనుకున్నది జపాన్ దేశంలోని 'కొకోరో' అనే నగరం మీద. ఐతే దానిమీద దట్టమైన పొగమంచు కప్ప

బడి వుండటంతో ఎంచుకున్న లక్ష్యం పైలెట్‌కి, ఇతర సిబ్బందికి స్పష్టంగా కనిపించలేదు. అప్పుడు విమానం రెండవ లక్ష్యంగా పెట్టుకున్న 'నాగసాకి' నగరం మీదికి వెళ్ళింది. అక్కడా పొగమంచు కప్పి వుంది. అయితే కొద్ది సమయం తర్వాత ఆ పొగమంచు విచ్చుకుంది. నగరం కనపడటం వల్ల రెండవ అణుబాంబును ఆ నగరం మీద వదిలారు. నేను విన్నది ఇంకా వుంది. 1945 ఆగస్టు నాటి వాతావరణ రికార్డుల ప్రకారం 'కొకోరో' నగరం మీద ఆగస్టు 9 న పొగమంచు ఏర్పడలేదు. ఇది విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని, వివరించలేని విషయం.

మరి ఆ పైలెట్ చూసిన పొగమంచు ఏమిటి? దీనికి సమాధానం ఆధ్యాత్మికమైనది. 'కొకోరో' నగరంలో అనేకవందల ఏళ్ళుగా వేలాదిమంది బౌద్ధబిక్షువులు నిరంతరం 'ధ్యానం' చేస్తున్నారు. వాటివల్ల పుట్టిన ధ్యానశక్తి నగరానికి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టించింది. ఆ కవచమే నగరాన్ని కాపాడింది. 'కొకోరో' అనే పేరుకు భాషలో ప్రశాంతత, ఐక్యత, అంతరంగ ప్రసన్నత వంటి అర్థాలు ఇమిడి వుండటం కాకతాళీయమా, ఏమైనా, ఆ నగరం మానవాతీత శక్తితో రక్షించబడింది. హేతువాదం కూడా వివరించలేనన్ని కాకతాళీయాలు ఆనాడు ఆ నగరంలో జరిగాయి.

ఈ రెండు సంఘటనలు ధ్యాన శక్తిని నిరూపించాయి. ఎవరైనా ధ్యానం చేసినప్పుడు ఒక విస్తృతశక్తి విశాల పరిధిలో తయారై అసాధ్యాన్ని సాధ్యంగా మారుస్తుంది.

 

సురేష్ పద్మనాభన్

Go to top