" పూర్వజన్మకృతం పాపం "

 

నాపేరు శ్రీమతి ఇందిర హైదరాబాద్. "పూర్వజన్మల గురించి అలాగే ధ్యానం మరి ఆధ్యాత్మిక ఉన్నతికై డాక్టర్ హారి గారిని కలవడం మొదటి సెషన్‌లో పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ చేయించుకుంటున్న వ్యక్తిని చూసి నేను థెరపీలో పాల్గొన్నాను. మొదటిరోజు నాలోనుంచి సంపూర్ణమైన నవ్వు బయటికి వచ్చింది. శరీరం అంతా తిమ్మిరిగా మరి స్పర్శలేని విధంగా తయారై అద్భుతమైన రిలాక్సేషన్ పొందాను. యోగిక్ ముద్రలు, సెల్ఫ్ హీలింగ్ అనుభవాలు కలిగాయి. పత్రీజీ గారు చాలా స్పష్టంగా నవ్వుతూ కనిపించి నాకు ఎంతో శక్తిని అందించిన అనుభవం కలిగింది. రెండురోజుల వరకు తగ్గని ఉత్సాహం, ప్రశాంతత మొదటి సెషన్ వల్ల కలిగింది. రెండవ సెషన్ కాన్ఫరెన్స్‌హాల్ అందులో వివిధ సైంటిస్ట్‌ల సమూహం, అందమైన యువతిగా వున్న నేను 'మేడమ్ క్యూరీ' గా పాస్ట్‌లైఫ్ రిగ్రేషన్ సెషన్‌లో చూసుకున్నాను. పత్రీజీ గారిని కలిసినప్పుడు '40 రోజులు డాక్టర్ హరి గారి సెషన్స్‌కు వెళ్ళండి' అన్నారు. రోజురోజుకూ నాలో ఎంతో మార్పు, ధ్యానంలో త్వరగా ఆలోచనారహితస్థితి రావటం చక్కని అనుభవాలతో ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా వుంది జీవితం. పత్రీజీ గారికీ మరి డాక్టర్ హరి గారికీ కృతజ్ఞతలు.

 

ఇందిర
హైదరాబాద్

Go to top