" పత్రీజీకి కెనడాలో స్వాగతం చెబుతాను "

 

నా పేరు జ్యోతి. మా వారి పేరు శ్రీనివాస్. సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని రజని, రవి గార్ల ఇంట్లో నలభై రోజుల ధ్యానం క్లాసుల సెప్టెంబర్ నెలలో జరిగినప్పుడు చికెన్ గునియా వచ్చినా కూడా నేను మొదటిరోజు క్లాస్‌కి వెళ్ళాను. రెండు మూడు రోజులలోనే నేను సత్యం గ్రహించి మెడిసిన్స్ మానేశాను. మా ఫ్యామిలో అంతా 'ధ్యానం ఫ్యామిలీ' అయిపోయింది.

గత పదేళ్ళుగా పెరాలసిస్‌తో బాధపడుతూన్న మా మామ గారు .. శ్రీ M.పాండురంగం గారు ... ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాత లేచి కూర్చుంటున్నారు. ఒక డాక్టర్ కావాలంటే ఒక కోర్స్ చదవాలి. ధ్యానం చేస్తే ఏ కోర్స్ చదవనక్కర్లేదు. సెల్ఫ్ హీలింగ్ చేసుకోవచ్చు. "మనోవ్యాధికి మందులేదు" అంటారు .. ఉంది. అదే ఆనాపానసతి ధ్యానం.

స్నానం చేస్తే శరీరం శుభ్రమవుతుంది. ధ్యానం చేస్తే ఆత్మ శుభ్రం అవుతుంది. ఆత్మానందం అంటే ఏమిటో, ముక్తిమార్గం అంటే ఏమిటో బ్రహ్మర్షి పత్రీజీ ద్వారా తెలుసుకున్నాను. పత్రి సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే. మన శ్వాసే మనకు గురువు అని ఎంతో సింపుల్‌గా చెప్పారు పత్రీజీ. ఆయన అన్నీ చేసి, చెరుకురసం మనకిచ్చారు. ఆయన చెప్పినట్లు ధ్యానం చేసి, ధ్యాన ప్రచారం చేస్తే ఎటువంటి కర్మనైనా ఆనందంగా అనుభవించవచ్చు, కర్మను తగ్గించుకోవచ్చు, దగ్ధం చేసుకోవచ్చు. చక్కగా మాట్లాడే శక్తిని ఇచ్చేది ధ్యానం.

నేను మా వారితో కలిసి కెనడాకు మా వారి ఉద్యోగరీత్యా వెళ్ళాలనుకుంటున్నాం. కెనడాలో మా ఆడబిడ్డ వుంది. వారికి కూడా ధ్యానం నేర్పించాం. కెనడా వెళ్ళి నేను అక్కడ ధ్యాన ప్రచారం చేసి, పత్రీజీకి కెనడాలో ధ్యాన స్వాగతం చెబుతాను. అక్కడ పత్రీజీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 'ధ్యాన కెనడా' చేయాలన్నదే నా దృఢ సంకల్పం.

 

M. జ్యోతి శ్రీనివాస్
వెస్ట్‌మారేడ్‌పల్లి
సికింద్రాబాద్

Go to top