" అందరిలోనూ నేనే "

నా పేరు కమల. నేను 2004 ఫిబ్రవరిలో ఆదోని మాస్టర్ ధ్యాన విద్వన్మణి తిరుమలాదేవి గారి ద్వారా ధ్యానంలో ప్రవేశించాను. మేడమ్ గారు చెప్పే విషయాలు తు.చ. తప్పకుండా పాటిస్తున్నాను. మొదట్లో ఎప్పుడంటే అప్పుడు అర్థరాత్రి కూడా విపరీతంగా ధ్యానం చేస్తూ నాకున్న డస్ట్ ఎలర్జీ, మోకాళ్ళనొప్పులు, వింటర్ సీజన్‌లో వచ్చే ఆయాసం, పార్శ్వనొప్పి వీటన్నింటినీ పోగొట్టుకున్నాను. ఇవన్నీ నా నుంచి ఎప్పుడు నయమయ్యాయో కూడా తెలియనంతగా దేహం గురించి ఆలోచన లేకుండా నిరంతరం ధ్యానం చేసేదాన్ని. ధ్యానం గురించి నాకు తెలియకుండానే చిన్న చిన్న కవితలు, పాటలు వచ్చేవి.

ఎవరిని చూసినా అందరిలోనూ నేనే. అక్కడ నేనే. ఇక్కడ నేనే. ఈ అనుభూతి వింత పులకరింత. ఎక్కువుగా మాట్లాడే నేను మౌనంగా అయిపోయాను. నాలో వచ్చిన మార్పులు చూసి మా ఇంట్లో మా ఆయన, మా పిల్లలిద్దరూ కూడా ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం జరుగుతోంది. నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం చేస్తున్నా కూడా నాలో తృష్ణ తీరలేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలనే తపన. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక్కో సబ్జెక్ట్ వుంటుంది కదా. అందుకని అందరూ మాస్టర్స్ చెప్పేది వినడం, గమనించడం చేస్తుంటాను. ధ్యానరత్న ప్రేమ్‌నాథ్ గుప్త గారి దగ్గర నేను తెలుసుకున్న జ్ఞానాన్ని, ఆచరించినదాన్ని ఎలా పంచాలి అన్నది నేర్చుకున్నాను. అందరి దగ్గర తెలుసుకున్నది పంచుతూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను.

 

- కమల గోవిందరాజులు,
ఆదోని

Go to top