" జ్ఞానాన్ని, శక్తిని ప్రస్తుతక్షణంలో విస్తృతంగా తీసుకువచ్చిన అనుభవం కలిగింది "

 

"సుమారు రెండు సంవత్సరాలుగా ఎడమ భుజం నొప్పితో బాధపడుతున్న నేను డాక్టర్ హరి గారిని కలిసి బ్రెత్ వర్క్ చేస్తున్నప్పుడు తిరిగి ఆ నొప్పి విపరీతంగా రావటం అందులోకి రిథమిక్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు ఎంతో అందంగా వుంటూ, ఎంతో గర్వంతో అందరిపైన ఆధిపత్యం చేసే సంపన్న కుటుంబంలో 'మేరీ' అనే పేరుతో పిలవబడే నేను కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అవటం ఎడమభుజం ఫ్రాక్చర్ అవడం, తలకు బాగా గాయం తగలటంతో అక్కడికక్కడే మరణించడం జరిగింది.

"ఆ బాధను అలాగే ఈ జన్మ వరకు తీసుకుని వచ్చి సెల్యూలార్ మెమొరీతో ఈ జన్మలో దాదాపు అదే వయస్సులో వున్నప్పుడు ఏ కారణం లేకుండా వచ్చిన ఎడమభుజం నొప్పితో బాధపడుతూ వుండటం మూలకారణంగా పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్‌తో తెలుసుకున్నాను. "అసంపూర్ణమైన అనుభవం ఏదైనా కూడా పునరావృతమవుతుందని పాస్ట్‌లైఫ్ థెరపితో తిరిగి అనుభవాన్ని పరిపూర్ణంగా అనుభవించి థెరపిస్ట్ సహాయంతో గతం గతః అని అక్కడనే వదిలి ప్రస్తుతక్షణంలో రావడంతో ఆ నొప్పి దూరం చేసుకోగలిగాను.

"బెలూన్ యాంజియోప్లాస్టి చేయించుకుని అప్పుడు గుండెలో తెలియని బాధ, భయంతో వున్న మా నాన్నగారు గత జన్మలో ఒక మతబోధకుడిగా సన్మార్గంలోకి అందరినీ మరల్చుతుండటం ఒక వ్యక్తి తుపాకీ పేల్చగా బుల్లెట్ గుండెలోకి దూసుకుని రావటం ... ఆ బాధను తిరిగి పాస్ట్‌లైఫ్ థెరపీలో సంపూర్ణంగా అనుభవించి, ఆ విషయాన్ని అక్కడే వదిలివేయటం మాస్టర్ల సహాయంతో చక్కని జ్ఞానాన్ని, శక్తిని ప్రస్తుతక్షణంలో విస్తృతంగా తీసుకువచ్చిన అనుభవం కలిగింది."

 

లత
హైదరాబాద్

Go to top