" మార్పు తీసుకుని వచ్చినందుకు ధ్యానంకూ కృతజ్ఞతలు "

 

"ఆల్కహాల్ వ్యసనంలో పూర్తిగా కూరుకుపోయి శరీరమంతా వణకడం, నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు, దయ్యాలు, భూతాలు నన్ను కంట్రోలు చేస్తున్న భావన, శారీరక నిస్సత్తువతో బాధపడుతూ డ్యూటీకి వెళ్ళలేకపోతున్న నన్ను చూసి పైమా మాస్టర్ స్రవంతి డాక్టర్ హరి గారిని సంప్రదించేలా చేశారు.

"మొదటిరోజు బ్రెత్ వర్క్ చేసినప్పుడు శరీరం అంతా నొప్పులు, తిమ్మిరులు మొదలై అవన్నీ శ్వాస సహాయంతో దూరం చేసుకుని శరీరం, మనస్సు పూర్తిగా రిలాక్స్ అయ్యాయి. ప్రతిరోజూ నిద్రలో భయంకరమైన రూపాలు కనిపించేవి. ఒక వ్యక్తి కనిపించి చాలా ప్రోత్సాహక మాటలు, ధైర్యం చెప్పిన కల వచ్చింది. మూడు రోజులలో నా శరీరంలోని వణుకుడు తగ్గింది. పదిరోజులు అబ్జర్వేషన్‌లో వుండి ముప్పైవేలు పైగా ట్రీట్‌మెంట్‍కు ఖర్చు అవుతుందని పేరున్న సైకియాట్రిస్ట్ చెప్పగా ... చాలా సింపుల్ శ్వాస చికిత్సతో మందులను మాన్పించి ధ్యానం చక్కగా కుదిరేలా శిక్షణ ఇచ్చి వారం రోజులలోనే నాలో చక్కని మార్పు తీసుకుని వచ్చినందుకు ధ్యానంకూ, మరి డాక్టర్ హరి గారికీ కృతజ్ఞతలు."

 

రమేష్
హైదరాబాద్

Go to top