" మహాఋషులు కనిపించారు "

 

నా పేరు రమ. మాది రాజమండ్రి.. నేను ధ్యానంలోకి వచ్చి మూడునెలలు అయ్యింది. నేను ధ్యానంలో రావటానికి కారణం మావారి స్నేహితులు శ్రీ C.S.మూర్తి, కల్పన గార్లు. వారు నిర్వహిస్తున్న ఉచిత ధ్యానయజ్ఞం క్లాసులకు హాజరయ్యాను. రాజమండ్రిలో ప్రతి శనివారం జరిగే ధ్యాన క్లాసులకు ఒకటి, రెండుసార్లు హాజరయ్యాను.

మార్చి 22 వతేదీన రాజమండ్రిలో బ్రహ్మాండమైన ధ్యాన యజ్ఞం క్లాసు బ్రహ్మర్షి పత్రీజీ గారిచే నిర్వహించబడింది. సుమారు రెండువేలమంది వచ్చారు. ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు. ఒక గంట ధ్యానం చేయించారు. ముఖ్యంగా పత్రీజీ గారు చెప్పిన "తొమ్మిది సూత్రాలు" చాలా అద్భుతంగా వుండి, అందరిచే ఆచరించతగినవిగా వున్నాయి.

మే నెలలో బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో జరిగిన బుద్ధ పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళాం. చాలా అద్భుతంగా ఏడురోజులు గడిచాయి. 14 వ తేదీన ఒక మహాద్భుతం జరిగింది. విరాళాలు సేకరణలో మావారు వెయ్యి రూపాయలు ఇచ్చారు. నేను వెళ్ళి ఒక బంగారు గాజు ఇవ్వగా పత్రీజీ గారు నా తలపై చేయివేసి ఆశీర్వదించారు. తర్వాత ధ్యానం చేయించారు. ఆ ధ్యానంలో నాకు అనేక అద్భుతమైన మహాఋషులు కనిపించారు.

మే నెలలో 26,27,28 తేదీలలో భీమవరంలో శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారు నిర్వహిస్తున్న ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరానికి హాజరయ్యాను. ఆ క్లాసులకు వెళ్ళిన దగ్గర్నుంచి, మా ఇంటి చుట్టుప్రక్కలవాళ్ళకు ధ్యానం చేయమని చెప్పటం, మా వారిచే 15,000 రూపాయలు లైఫ్ మెంబర్‌షిప్ కట్టించాను.

ధ్యానం చేయటం వలన చాలా లాభాలు కలుగుతున్నాయి. నాకు నడుమునొప్పి, కాళ్ళనొప్పులు వుండేవి. ఆపరేషన్ చేయాలన్నారు. నేను భయపడి చేయించుకోలేదు. కానీ భీమవరంలో ధ్యానం క్లాసులకు వెళ్ళిన తర్వాత నుంచి నడుమునొప్పి తగ్గింది. నేను ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుని ధ్యానం చేయగలుగుతున్నాను. ధ్యానం వలన ఇప్పుడు నా ఆరోగ్యం కుదుటపడింది. ధ్యానం చేయటం ఒక మహాద్భుతం. పత్రీజీ గారి ఆశీస్సుల ద్వారా, మా ఇంటిపై త్వరలో పిరమిడ్ కట్టిస్తున్నాం.

 

D.రమ
H.No. 79-20-4
మల్లిన నగర్, రాజమండ్రి

Go to top