" ధ్యానానికి బ్రహ్మరథం, ధ్యాన మాస్టర్లకు బ్రహ్మరథం "

 

ధ్యానానికి బ్రహ్మరథం. ధ్యాన మాస్టర్లకు బ్రహ్మరథం. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి బ్రహ్మరథం. బ్రహ్మర్షి పత్రీజీకి బ్రహ్మరథం.

ప్రపంచంలో ఎన్నో మతాలు ... ఎన్నెన్నో ఆధ్యాత్మిక సంస్థలు, ఎన్నెన్నో సాధనలు .. ఎందుకు? .. ఆరోగ్యం కోసం. ఆనందం కోసం..

మానవాళిని పట్టి పీడిస్తున్న మౌలిక సమస్యలకు .. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయితే తన భుజస్కంధాలపై వేసుకుని పరిష్కారం చూపిస్తుందో .. ఆ సంస్థకి యావత్ మానవులు బ్రహ్మరథం పడతారు .. జేజేలు కొడతారు .. ఇది సత్యం. ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలు ... మూడు:

*ఆరోగ్యం* పర్సనల్ రిలేషన్‌షిప్స్* మనీ

ఈ మూడు సమస్యలకూ సత్వర పరిష్కారం కనుక్కుని ఓ ప్రణాళిక ప్రకారం ముందడుగు వేసారు బ్రహ్మర్షి పత్రీజీ.

"ఆరోగ్యం"

ధ్యానం సర్వరోగనివారిణి, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికే సంపూర్ణ శారీరక ఆరోగ్యం. ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి ఏ మానసిక సమస్యలూ వుండవు.

శ్వాస మీద ధ్యాసలో శారీరక రుగ్మతలు ... ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుంచి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు .. అన్నీ అదృశ్యం. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో చేరిన లక్షలాది ధ్యానులకు ఆరోగ్య సమస్యలు మాయం అయిపోయాయి.

"పర్సనల్ రిలేషన్‌షిప్స్"

మనిషి ఏ స్థాయిలో వున్నా, ఏ స్థితిలో వున్నా అత్యంత ముఖ్యమైనది వ్యక్తిగత ఇంటర్ పర్సనల్ రిలేషన్‌షిప్స్.

సరియైన, పరస్పర గౌరవప్రదమయిన సంబంధాలు ... ఇది లేకనే మానవాళి అంతా మానసికంగా కొట్టుమిట్టాడుతోంది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చిన వారికి మొట్టమొదటి రోజు ... మొట్టమొదటి పాఠం ... "నువ్వు శరీరం కాదు - ఆత్మపదార్థం." రెండవరోజూ .. రెండవపాఠం ... "ప్రక్కవాడివీ నువ్వే, అవతల వాడివీ నువ్వే." మూడవరోజు .. మూడవ పాఠం ... " కోరి సాధించవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు. వస్తూంటే 'వస్తుందిరా' అని సంబర పడిపోకు. పోతూంటే 'పోతుందిరా' అని ఏడవమాకు. "నాలుగవరోజు .. నాలుగవ పాఠం .. "నో జడ్జిమెంట్స్ అండ్ నో కంప్లైంట్స్", "దేర్ ఆర్ నో విక్టిమ్స్ అండ్ నో విలన్స్."

ఈ పాఠాల ద్వారా ఎప్పుడైతే 'ఓ బృహత్ అవగాహన' వస్తుందో .. అప్పుడే సరియైన పర్సనల్ రిలేషన్‌షిప్ కుదిరేది.

అప్పుడు తెలిసిపోతుంది జీవితంలో ఎలా వ్యవహరించాలో ..

* జరిగేదాన్ని అంతా ఆత్మదృష్టితో చూడాలి.
* అందరితో ఆత్మదృష్టితో మెలగాలి.
* కలిసినవాళ్ళతో ఆత్మపరంగా సంగమించాలి.
* ఆత్మానుబంధమే ఆనందానుబంధం.

"మనీ"

ధ్యాన మార్గంలో ప్రయాణించేవారికి ఆర్థిక బాధలు వుండవు.
* హెల్త్ ప్రోబ్లమ్స్ నిల్. కనుక NO - డాక్టర్ ఫీజ్. NO - మందుల ఖర్చు.
* రిలేషన్‌షిప్ ప్రోబ్లమ్స్ నిల్. కనుక NO - డిప్రెషన్ ప్రోబ్లమ్స్. మళ్ళీ NO - మందుల ఖర్చు.
* పూజలు నిల్. వ్రతాలు నిల్. కనుక డబ్బు ఆదా.
* NO - మాంసం. కనుక డబ్బు ఆదా.
* చెడు అలవాట్లు మాయం కనుక, NO - మనీ ఖర్చు.
* పనికిరాని మాటలు మాయం. కనుక వృత్తులలో రాణింపు. కనుక అధిక ఆదాయం.

కనుక అధిక ఆదాయం ... వెరసి సకల ఆర్ధిక సమస్యలూ క్లియర్.
అందుకే ఎక్కడికి వెళ్ళినా .. ఆనాపానసతికి బ్రహ్మరథం.
పిరమిడ్ మాస్టర్లకు బ్రహ్మరథం.
పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కి బ్రహ్మరథం.
బ్రహ్మర్షి పత్రీజీకి బ్రహ్మరథం.

 

D. శివప్రసాద్

Go to top